రాష్ట్రీయం

అన్నారం బ్యాక్ వాటర్ 32 కిలోమీటర్లకు చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, జూలై 15: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ సోమవారం 32 కిలోమీటర్లకు చేరుకుంది. అన్నారం బ్యారేజీ సామర్ధ్యం 10.87 టీఎంసీలకు గాను 4.47 టీఎంసీల నీటి నిల్వ బ్యారేజీలో ఉందని అధికారులు తెలిపారు. 119 వాటర్ లెవల్‌కు గాను 115.500 మీటర్ల లెవల్‌లో నీటి ప్రవాహం అన్నారం బ్యారేజీలో ఉంది. ఇప్పటి వరకు 10,594 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో అన్నారం బ్యారేజీ బ్యాక్‌వాటర్ 32 కిలో మీటర్లకు చేరింది. అలాగే మేడిగడ్డ వద్ద 6.8 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు ఇఇ రమణారెడ్డి తెలిపారు. బ్యారేజీ 85 గేట్లు మూసివేయడం పట్ల ఇప్పటికే 12 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో నీరు చేరిందని వారు పేర్కొన్నారు. కనె్నపల్లి పంపుహౌస్ వద్ద ఆదివారం నుండి 5 మోటార్లచే నీటిని ఎత్తిపోయడం వల్ల గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి నీటిని తరలిస్తున్నారు.
మేడిగడ్డ బ్యాక్ వాటర్‌తో పంట పొలాలకు ముప్పు
మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు మూసివేయడంతో మండలంలోని పరిసర గ్రామాల పంట భూములు నీట మునిగిపోతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని వాగులు వంకలు గోదావరి నీరు కమ్మేయడంతో పంట భూములు నష్టపోవలసివస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం స్థానిక జడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్ ఆయా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీట మునిగిన పంట భూములపై స్థానిక ఎమ్మెల్యే శ్రీ్ధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లినట్టు వారు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ్ధర్‌బాబు స్పందించి కాళేశ్వరం ఇఇకి ఫోన్ ద్వారా మేడిగడ్డ బ్యారేజీ ఎగువన పంట భూములు మునిగిపోతున్నాయని, వెంటనే ఆయా ప్రాంతాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించినట్టు జడ్పీటీసీ అరుణ శ్రీనివాస్ తెలిపారు.
చిత్రం... అన్నారం వద్ద ఎగువకు పోతున్న గోదావరి జలాలు