రాష్ట్రీయం

తేల్చుకుందాం.. చూసుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ఆటో కార్మికుల విషయమై మంగళవారం శాసనసభలో తీవ్రస్థాయిలో గందరగోళం చెలరేగింది. గత ఏడాది మే ఒకటో తేదీన మచిలీపట్నంలో పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ తనను కల్సిన ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు నేడు సొంత ఆటో కలిగిన కార్మికులందరికీ రూ.10వేలు చొప్పున నగదు అందించేందుకు బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. రాష్ట్రంలో ఆటోలు, టాక్సీ కాబ్ మొత్తం కల్సి 7,95,740 తిరుగుతుంటే వీటిలో సొంత వాహనాలు కల్గినవారు ఆరు లక్షలకు పైగా ఉంటారనేది అంచనా అని చెప్పారు. ఆటో కార్మికులకు జగన్ వరాలు ప్రకటించిన తర్వాత చంద్రబాబు మేల్కొని ఎన్నికల సమయంలో ఆటోలపై లైఫ్‌టాక్స్‌ను తొలగించారంటూ తీవ్రంగా విమర్శించారు. దీనిపై రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ అద్దె ఆటో నడిపే వారిని కూడా రూ. 10వేలు అందచేయాలని కోరారు. చంద్రబాబు ఆటో కార్మికులకు చంద్రన్న బీమాను వర్తింపచేసారని అన్నారు. మంత్రి పేర్ని ఏదో హడావిడిగా అధికారులు ఇచ్చిన కాగితాలను బట్టీపట్టి ఇక్కడేదో చెబుతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో రభస ఆరంభమైంది. సభా సాంప్రదాయాలు తెలియని సత్యప్రసాద్‌ను రెండోసారి ఎందుకు గెల్పించామా అని రేపల్లె ప్రజలు, అలాగే అచ్చెన్నాయుడుని శాసనసభకు ఎందుకు పంపించామా అని టెక్కలి ప్రజలు బాధపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు వెంటనే లేచి ప్రతిసారి 151 మంది అధికార పక్ష సభ్యులకు నేనొక్కడినే కన్పిస్తున్నాను, మంత్రి తనను ‘నీయమ్మ’ అన్నారంటూ ఆవేశంతో ఊగిపోయారు. దీనిపై టీడీపీ సభ్యులంతా లేచి నిలబడి నిరసన తెలిపారు. మంత్రి వ్యాఖ్యలపై తనను మాట్లాడనివ్వాలంటూ అచ్నెన్నాయుడు కోరగా స్పీకర్ తొలుత తిరస్కరించారు. దాంతో చంద్రబాబుతో సహా ఆ పార్టీ సభ్యులందరూ లేచి నిలబడి ‘వియ్ వాంట్ జస్టిస్... సభలో రక్షణ కల్పించాలి’ అంటూ నినాదాలివ్వగా అధికార పక్ష సభ్యులందరూ లేచి నిలబడి ‘తేల్చుకుందాంరా... బాబు డౌన్‌డౌన్... ఖబడ్దార్... రౌడీయిజం నశించాలి’ అంటూ నినాదాలిచ్చారు. అచ్చెన్నాయుడు వేలెత్తి చూపుతూ స్పీకర్‌ను బెదిరిస్తున్నారని, ఆటోడ్రైవర్‌లపై చర్చకు అవకాశం కల్పించడం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. గతంలో అచ్చెన్నాయుడు తమను పరుష పదజాలంతో ఎలా దూషించారో చూడండి అంటూ నాటి పత్రిక క్లిప్పింగ్‌లను సభలో ప్రదర్శించారు. ప్రభుత్వ చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అమ్మా! ఎందుకు పంపించామని టెక్కలి ప్రజలు బాధపడున్నారనే మంత్రి చెప్పారని అన్నారు. మంత్రి పేర్ని మాట్లాడుతూ తాను ఎవరినీ దూషించలేదని ఒక వేళ స్పీకర్ నిరూపిస్తే తాను బేషరతుగా క్షమాపణ చెబుతానన్నారు. సభను ఆర్డర్‌లో పెట్టాలని పయ్యావుల కేశవ్ అన్నారు. వైసీపీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి లేచి టీడీపీ సభ్యులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. గతంలో సభా ఆర్డర్‌లో లేనప్పుడు కూడా నడిపారంటూ ఆధారాలతో నిరూపిస్తానన్నారు. తమ ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు అసెంబ్లీలో సస్పెన్షన్ విధించగా ఆమెకు తన వాదన విన్పించేందుకు
కూడా అవకాశం కల్పించలేదని, అలాగే వెన్నుపోటుతో సీఎం అయిన చంద్రబాబు ఒక్కసారైనా ఎన్టీఆర్‌కు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. అచ్చెన్నాయుడు బెదిరించే ధోరణితో మాట్లాడుతున్నారని అన్నారు. ఇక స్పీకర్ వారించినా టీడీపీ సభ్యులు తమ నినాదాలను ఆపలేదు. చంద్రబాబు వినతిపై అచ్చెన్నాయుడుకు స్పీకర్ మాట్లాడే అవకాశం కల్పిస్తూ సబ్జెక్టును మాత్రమే మాట్లాడి త్వరగా క్లోజ్ చేయాలన్నారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పీకర్‌ను ఉద్దేశించి నేను సబ్జెక్టుకు వస్తున్నా.. లేదంటే మీరు రాసివ్వండి నేను చదివేస్తానన్నారు. దీనిపై స్పీకర్ తీవ్రంగా ఆగ్రహించారు. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తారా అని ప్రశ్నించగా చంద్రబాబు లేచి నిలబడి తాను సమర్థించడం లేదు, అయితే చెవిరెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా అని ప్రశ్నించగా స్పీకర్‌నే ప్రశ్నిస్తారా అంటూ అధికారపక్ష సభ్యులు విరుచుకుపడ్డారు.