రాష్ట్రీయం

మీ వైఖరేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 16: రాష్ట్ర విభజన నాటి నుంచి కాపు రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రతరమైందని, అయితే నాడు 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో దీనిపై ఆధ్యయనానికి రూ.40 లక్షలు కూడా కేటాయించకుండా వంచించారని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. శాసనసభలో మంగళవారం కాపు రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాపుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ వర్గానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశం చేర్చామని తెలిపారు. బీసీలకు అన్యాయం జరక్కుండా రిజర్వేషన్లు అమలు చేయాలని భావించి మంజునాథ్ కమిషన్‌ను నియమించామని, కమిషన్ నివేదికను కేంద్రానికి పంపామని వివరించారు. ఇది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈడబ్ల్యుఎస్) ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు అమలు చేయాలని నిర్ణయించామన్నారు. దీన్ని వైసీపీ ప్రభుత్వం
అమలు చేస్తుందో లేదో తేల్చాలని పట్టుపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కాపు కార్పొరేషన్ ఏర్పాటైందని చెప్తూ రిజర్వేషన్లపై 2004 నుంచి 2009 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. మంజునాథ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కాపుల స్థితిగతులను గుర్తించి నివేదిక రూపొందించిందని గుర్తుచేశారు. రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి చేరుకోవటంతో దీనిపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. రిజర్వేషన్ల అమలుకు వైసీపీ ఏ రకమైన హామీ ఇస్తుందో వివరించాలని విజ్ఞప్తి చేశారు.