రాష్ట్రీయం

ఆల్మట్టికి జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ఎట్టకేలకు ఆల్మట్టి రిజర్వాయర్ నిండబోతోంది. నిన్న మొన్నటి వరకు ఎడారిలా ఉన్న ఆల్మట్టి కర్నాటక, మహారాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాలతో జలకళను సంతరించుకుంది. ఇప్పటికే జలాశయం 85శాతం నిం డింది. కర్నాటకలో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీ. ప్రస్తుతం 105 టీఎంసీలకు నీరు చేరింది. 15 రోజుల వ్యవధిలో ఆల్మట్టికి పెద్ద ఎత్తున వరద నీరు చేరడం ఆంధ్ర, తెలంగాణ రైతాంగానికి ఒకింత ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఒక లక్ష క్యూసెక్కుల నీరు వస్తోంది. గేట్లు తెరిచి దిగువకు 35 వేల క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. ఆల్మట్టిపైనే జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు నిండితే కర్నాటక గేట్లు ఎత్తేస్తుంది. ఇంకా పైన వర్షాలు కురిస్తే, ఆ నీళ్లన్నీ జూరాల ద్వారా దిగువున ఉన్న శ్రీశైలంకు చేరుకుంటాయి. ప్రస్తు తం నారాయణ పూర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామ ర్థ్యం 37 టీఎంసీ ఉండగా, 30 టీఎంసీకి చేరుకుంది. నారాయణ్‌పూర్ పూర్తి స్థాయిలో నిండితేకానీ ఇక్కడి నుంచి నీరు దిగువకు రాదు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నీటి మట్టంలో ఎలాంటి మార్పులు లేవు. ఈ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ఆల్మట్టికి ఎగువున కర్నాటక, మహారాష్టల్రో అతి భారీ వర్షాలు ఈ నెలాఖరు వరకు కొనసాగుతాయని సాగునీటి నిపుణులు, వాతావరణ శాఖ అధికారులంటున్నా రు. ఇదే జోరు కొనసాగితే, ఆల్మట్టి వచ్చే వారం రోజుల్లో నిండితే, నెలాఖరు నుంచి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశముంది. ఆల్మట్టికి దిగువున, తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో ఆల్మట్టి నుంచి వచ్చే నీరు తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.