రాష్ట్రీయం

నేటి ఉ. 11 గం. తర్వాత శ్రీవారి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 16: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం రాత్రి 7 గంటలకు శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు, అధికారులు మూసివేశారు. మంగళవారం అర్థరాత్రి 1.31గంటల నుండి ఉదయం 4.29గంటల వరకు చంద్రగ్రహణం ఘడియలు ఉన్న నేపథ్యంలో మంగళవారం నాడు గ్రహణ సమయానికి ఆరుగంటల ముందే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. కాగా మంగళవారం నాడు కూడా కేవలం ఐదుగంటలు మాత్రమే భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
బుధవారం ఉ. 5గంటలకు తలుపులు తెరిచి సంప్రోక్షణ అనంతరం శ్రీవారికి సుప్రభాతం, తోమాల, కొలుపు, అర్చనాది సేవలను ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం ఆణివార ఆస్థానం పూర్తి చేసి ఉదయం 11గంటల నుండి సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు. గ్రహణం కారణంగా సోమవారం పరిమిత సంఖ్యలోనే భక్తులను వైకుంఠం కాంప్లెక్స్‌లోనికి అనుమతించారు. మంగళవారం భక్తులను వైకుంఠం కాంప్లెక్స్‌లోనికి భక్తులను అనుమతించలేదు. తిరుమంజనం, గ్రహణం కారణంగా దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల జారీని సోమవారం అర్ధరాత్రి నుండే టీటీడీ ఆపివేసింది. వృద్దులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు కల్పించే ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. మంగళవారం నిర్వహించాల్సిన గరుడసేవను రద్దు చేసింది.
చిత్రం... తిరుమల శ్రీవారి మహాద్వారాన్ని మూసివేస్తున్న టీటీడీ ఈఓ తదితరులు