రాష్ట్రీయం

రాజ్‌భవన్‌కు హంగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 18: రాష్ట్ర గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న గవర్నర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. విజయవాడలో మాజీ సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉన్న ఇరిగేషన్ భవనాల్లో రాజ్‌భవన్ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. గత కొద్ది రోజులుగా నివాసంతో పాటు కార్యాలయ వసతి కోసం ఇరిగేషన్ కార్యాలయానికి అధికారుల పర్యవేక్షణలో హంగులు దిద్దుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌ను కార్యాలయ అవసరాలకు, మొదటి అంతస్తులో గవర్నర్ నివాసానికి తగిన వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. స్వరాజ్ మైదాన్‌కు చేరువలోనే ఉన్న ఈ కార్యాలయం ఇకపై రాజ్‌భవన్‌గా రూపుదిద్దుకోనుండటంతో నగరం ప్రత్యేక శోభను సంతరించుకోనుంది. కాగా గవర్నర్ బిశ్వభూషణ్ ఈ నెల 22న ఒడిశా నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి తిరుమల చేరుకుంటారు. 23న శ్రీవారి దర్శనం అనంతరం విజయవాడ వస్తారు. 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా గవర్నర్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఆయన గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గవర్నర్ కార్యదర్శిగా ప్రభుత్వం ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా రాజ్‌భవన్‌కు అన్ని హంగులు దిద్దుతున్నారు. హైదరాబాద్‌లో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కార్యాలయంలో పనిచేసే ఏపీ సిబ్బంది కూడా రాష్ట్రానికి వస్తున్నందున తగిన వసతి కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్‌భవన్ పనులను గురువారం ముఖేష్‌కుమార్ మీనాతో పాటు ప్రభుత్వ సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ఆర్సీ సిసోడియా పరిశీలించారు. ఈ భవనాల్లో ఒక దర్బార్ హాల్, సమావేశ మందిరం, 7 పడక గదులు, మరో 7 ఆఫీసు రూమ్‌లు సిద్ధమయ్యాయి. ఈ నెల 23 నాటికి ఏర్పాట్లు పూర్తవుతాయని సిసోడియా తెలిపారు. భద్రత పరంగా కూడా ఈ కార్యాలయం అనువుగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన అనంతరం తాత్కాలికంగా ఇదే భవనాల్లో కొద్దిరోజులు ఏపీ హైకోర్టు లావాదేవీలు నిర్వహించారు. రాజధానిలో భవనాలు సిద్ధం కావటంతో హైకోర్టును అక్కడికి తరలించారు. ప్రస్తుతం ఈ భవనాలను రాజ్‌భవన్‌గా తీర్చిదిద్దుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా కార్యలయంలోకి ఎవరినీ అనుమతించటంలేదు.
చిత్రం...రాజ్‌భవన్‌గా మారుతున్న ఇరిగేషన్ కార్యాలయ భవనం