రాష్ట్రీయం

కొత్తగా ఏడు కార్పొరేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎనిమిది నగర పాలక సంస్థలకు అదనంగా అదనంగా మరో ఏడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కొత్త మున్సిపల్ చట్టంలోనే కొత్తగా ఏర్పాటు చేయబోయే నగర పాలక సంస్థలను చేర్చారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే నగర పాలక సంస్థలలో రంగారెడ్డి జిల్లాలో మూడు, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో నాలుగు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లాలో బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్‌ఎంసీ), వరంగల్ నగరపాలక సంస్థ, కరీంనగర్ నగరపాలక సంస్థ, రామగుండం నగర పాలక సంస్థ, నిజామాబాద్ నగర పాలక సంస్థ, ఖమ్మం నాగర పాలక సంస్థ మొత్తం ఎనిమిది ఉండగా అదనంగా ప్రకటించిన ఏడు నగర పాలక సంస్థలతో కలిసి రాష్టవ్య్రాప్తంగా నగర పాలక సంస్థల సంఖ్య 12కు చేరుకుంది. ఇలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా
మరో రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, నాగర్‌కూర్నూల్ జిల్లా కొల్లాపూర్ రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయ్యాయి. కోరుట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మూడు మండలాలు, కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్‌లో కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవల్లి నాలుగు మండలాలను చేర్చినట్టు పేర్కొన్నారు.