రాష్ట్రీయం

అటు మావోలు.. ఇటు పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 18: తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాచలం డివిజన్‌లో వరుసగా జరుగుతున్న సంఘటనలు అక్కడి గిరిజనులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక వైపు ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు హత్యలకు పాల్పడుతుంటే, మరోవైపు మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో కూంబింగ్ పేరుతో పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారనే గిరిజనులు ఆరోపిస్తున్నారు. భద్రాచలం కేంద్రానికి 50కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్ల మండలం పొత్తూరు గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ నల్లారి శ్రీనివాస్‌ను ఇన్ఫార్మర్ నెపంతో మావోలు ఎత్తుకువెళ్ళి హత్య చేశారు. అలాగే బుధ, గురువారాల్లో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాల పేరుతో కరపత్రాలు వెలిశాయి. అంతకు ముందు మావోయిస్టులు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదలైన ప్రకటన మరింత ఆందోళనకు గురిచేసింది. ఆదివాసీలపై దాడులు, అక్రమ అరెస్టులు ఆపకపోతే అధికార పార్టీ నేతలను హతమారుస్తామని అందులో హెచ్చరించారు.
ఈ లేఖ వచ్చిన 24గంటల్లోగానే ఆదివాసీ సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు రావడంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏడాది కాలంలో ముగ్గుర్ని చంపారని, పోడుభూముల విషయంలో మావోయిస్టులకు సంబంధించిన వ్యక్తులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆదివాసీ సంఘం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. వీటికి తోడు అధికార పార్టీకి చెందిన ప్రధాన నాయకులు, ప్రజా ప్రతినిధులు మైదాన ప్రాంతంలో ఉండాలని, ఎటు వెళ్ళినా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో భద్రాచలం ఏజన్సీ ప్రాంతమంతా అట్టుడుకుతున్నది. అలాగే చత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే వారిని తనిఖీలు చేస్తున్నారు. చీకటి పడితే వాహనాలు కూడా తిరగడం లేదు. ఏజన్సీ ప్రాంతంలో తిరిగే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.
అంతే కాకుండా మావోయిస్టు చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని పోలీసులు, పోలీసుల విధానాలకు తిప్పికొడతామని మావోయిస్టులు పేర్కొంటున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల కనీస వౌలిక సదుపాయాలు లేక పలు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇరు వర్గాల మధ్య జరుగుతున్న పోరాటం ప్రాణసంకటంగా మారింది. పరిస్థితి అగమ్యగోచరమైంది.