రాష్ట్రీయం

ప్రజలే మాకు ‘బాస్’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: గురువారం ప్రారంభమైన తెలంగాణ శాసనసభ సమావేశం శుక్రవారానికి వాయిదా పడ్డది. గురువారం సభ ప్రారంభం కాగానే సభ్యులంతా విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తొలుత మాట్లాడుతూ, మంత్రి జగదీశ్‌రెడ్డికి తాను వ్యక్తిగతంగా, సభ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత మున్సిపల్ చట్టం బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు సమర్పించారు.
ఈ బిల్లుపై శుక్రవారం చర్చకు అనుమతిస్తానని స్పీకర్ తెలిపారు. గురువారం నాలుగు బిల్లులను సభ ఆమోదించింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగింది. బిల్లులపై చర్చ జరుగుతుండగా, కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా రెండు, మూడు పర్యాయాలు మైక్ కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది సభ్యులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతమన్నారు. ఇదే అంశంపై భట్టి మాట్లాడుతుండగా మైక్ కట్ అయింది. దాంతో తమకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇవ్వడం లేదని, సభాపక్షం నాయకుడు కేసీఆర్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర సభ్యులతో పాటు భట్టి విక్రమార్క సభ నుండి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజలే తమకు బాస్‌లన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావడాన్ని ఆయన సమర్థించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసమర్థ నాయకత్వం ఉందని, కాంగ్రెస్ నాయకత్వం సొంతపార్టీ ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతోందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు పార్టీమారడం కొత్త కాదన్నారు. రాజ్యాంగంలోనే ఇందుకు సంబంధించి అవకాశం ఉందన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని, రాజ్యసభ చైర్మన్ కూడా ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. అలాగే ఇటీవలే గోవాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారరన్నారు. ఆ తర్వాత సభను శుక్రవారం ఉదయం 10 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. గురువారం ఉదయం 11 గంటలకు సభ జరుగుతుందని అధికారికంగా ప్రకటించగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణీత సమయానికి రెండు నిమిషాల ముందు వచ్చారు. సభ ప్రారంభం అయ్యేందుకు జాతీయగీతాలాపన జుగుతుండగా కాంగ్రెస్ సభ్యులు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు సభలోకి వచ్చారు.
చిత్రం...శాసనసభలో గురువారం విద్యా శాఖ మంత్రి జగదీష్‌రెడ్డికి
జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న సీఎం కేసీఆర్