రాష్ట్రీయం

ఐదు బిల్లులకు మండలి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: పల్లెలను కూడా పట్టణాల తరహాలో అభివృద్ధి చేసేందుకు, అధికారులు, ప్రజాప్రతినిధులను సమానంగా భాగస్వాములను చేస్తూ సర్కారు రూపొందించిన మున్సిపాల్టీల బిల్లుతో పాటు మరో నాలుగు బిల్లులను శాసన మండలి శుక్రవారం ఆమోదించింది. మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నాం రెండు గంటలకు ప్రారంభమైన మండలి సమావేశం సుమారు మూడున్నర గంటల పాటు జరిగింది. తెలంగాణ మున్సిపాల్టీల చట్టం 2019, పంచాయతీరాజ్ (సవరణ) చట్టం 2019, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ(మెడికల్ ప్రొఫెసర్లు, అసిస్టెంటు ఫ్రొపెసర్లు) వయస్సు క్రమబద్దీకరణ(సవరణ) బిల్లు, తెలంగాణ పురపాలక శాసనముల(సవరణ)బిల్లు, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతి వృత్తుల వారు(సవరణ) బిల్లు, తెలంగాణ రాష్ట్ర రుణ విముక్తి కమీషన్ ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించిన బిల్లుల్లో మెడికల్ ఫ్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు క్రమబద్దీకరణ సవరణ బిల్లును రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మిగిలిన బిల్లులను అసెంబ్లీ వ్యవహారాల శాఖ వేముల ప్రశాంత్‌రెడ్డి సభలో ప్రతిపాదించారు. ఈ ఐదు బిల్లులపై అధికార టీఆర్‌ఎస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్, మజ్లీస్ సభ్యుల మధ్య చర్చ జరిగినానంతరం సభ బిల్లులను ఆమోదించింది.
ఆ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం
మొక్కల పెంపకానికి సంబంధించి కొత్తగా నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు జీవించకపోయినా, అందుకు బాధ్యులను చేస్తూ మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్లను పదవీ నుంచి తొలగించే అధికారాన్ని మున్సిపల్ చట్టంలో కలెక్టర్లకు అప్పగిస్తూ పొందుపర్చిన ప్రొవిజన్ 195 రాజ్యాంగంలోని 243జెడ్ ఏ క్లాజ్-2కు విరుద్దంగా ఉందని, దీని విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు సూచించగా, మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే బిల్లును తయారు చేశామని అన్నారు. కేంద్రం నుంచి ఏ మాత్రం ఆర్థిక సహాయం అందకపోయినా, గ్రామాలను కూడా పట్టణాల తరహాలో అభివృద్ధి చేసేందుకే ఈ బిల్లును తీసుకువచ్చామని, ప్రతి విషయాన్ని విమర్శించేలా వ్యాఖ్యానించటం తగదని సూచించారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వాగ్వాదం
ప్రభుత్వం తాజాగా తెచ్చిన మున్సిపాల్టీల చట్టంలో ఎస్సీ,ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తామని, మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేస్తామని సెక్షన్ 7లో పేర్కొనటం పట్ల కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, బీజేపీ సభ్యులు రాంచందర్‌రావులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో మైనార్టీలు కాకుండా బీసీల జనాభా 50 శాతం పైగానే ఉందని, బీసీలో చేర్చిన మైనార్టీలను కలుపుకుంటే 64 శాతానికి పెరిగిన బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయరని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సభ్యులు కడియం శ్రీహరి, పల్లారాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో బీసీల రిజర్వేషన్లు మీరంటే మీరు అడ్డు అంటూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సభ్యుల మధ్య రగడ జరిగింది. తనను మాట్లాడినివ్వటం లేదనిఇందుకు నిరసనగా జీవన్‌రెడ్డి వాకౌట్ చేశారు. సభ నిరవధికంగా వాయిదా వేశారు.