ఆంధ్రప్రదేశ్‌

ఇసుక మళ్లిస్తే ఊరుకోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 15: ఉచిత ఇసుక ప్రయోజనాలను ఎవరు దెబ్బతీసినా కఠిన చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శుక్రవారం తన నివాసం నుంచి జలవనరులు, భూగర్భ జలాలు, వ్యవసాయ, వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉచిత ఇసుక ప్రతి పేద కుటుంబానికి అందాలని అన్నారు. మండల, జిల్లా స్థాయిలో ఇసుక తవ్వకాలపై కమిటీలు వేయాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్, జాయిం ట్ కలెక్టర్ ఆర్డీఓ, డిఎస్పీ, తహశీల్దార్ సమష్టి బాధ్యతతో సమన్వయంతో వ్యవహరించి ఇసుక అక్రమ తవ్వకాలకు కళ్ళెం వేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పది లక్షల పంట కుంటల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఐదు ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉన్న రైతుల పొలాల్లో, గట్టి నేల ఉన్నచోట మాత్రమే యంత్రాలను వినియోగించాలని సిఎం సూచించారు. అంతకంటే తక్కువ భూమి ఉన్నచోట మాత్రం మాన్యువల్‌గానే పంటకుంటలను తవ్వాలని ఆయన ఆదేశించారు. ప్రతి మండలంలో ఎంపిడిఓ అధ్యక్షతన జలవనరుల శాఖ ఎఇ నోడల్ అధికారిగా మండల రిసోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు ఎక్కడ నిర్మించాలి? ఎన్ని నిర్మించాలి? అనే అంశాలపై కసరత్తు చేయాలని సూచించారు. భూగర్భశాఖ ఎడి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు ప్రాజెక్ట్ డైరక్టర్‌గా వ్యవహరించి జల సంరక్షణ కట్టడాల నిర్మాణ పనులపై శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు. వడదెబ్బ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. అవసరమైతే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో 549 మంది అధికారులు పాల్గొన్నారు.