రాష్ట్రీయం

వార్డుబాయ్ తనయుడికి నీట్ పీజీ ఫస్ట్ ర్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెఫ్రాలజీ విభాగంలో టాపర్‌గా రాజేష్
మహబూబాబాద్, జూలై 20: మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రమైన గార్లకు చెందిన చిలక రాజేష్ నీట్ మెడికల్ (నెఫ్రాలజీ) విభాగంలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో హాజరైన రాజేష్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించటం పట్ల గార్ల మండల ప్రముఖులు అభినందించారు. రాజేష్ తండ్రి చిలక నర్సయ్య మణుగూరు సింగరేణి కాలరీస్ చెందిన వైద్యశాలలో వార్డుబాయిగా పని చేస్తుండటంతో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మణుగూరులో విద్యాభ్యాసం చెయ్యడం, అనంతరం ఇంటర్మీడియట్ ఖమ్మంలోని ఒక ప్రైవేటు కళాశాలలో పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన
వెంటనే ఎంసెట్ పరీక్షలకు హాజరు కావటంతో మెడిసన్ చదివేందుకు అర్హత లభించింది. దీంతో హైద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో సీటు లభించటంతో ఎంబిబిఎస్, తర్వాత అక్కడే ఎండి జనరల్ మెడిసన్ పూర్తి చేశాడు. కొన్నాళ్ళ పాటు న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఇటీవల ప్రభుత్వం నీట్ పరీక్షలు నిర్వహించగా హాజరైన రాజేష్ తన ప్రతిభను కనబర్చి ఆలిండియా ఫస్ట్ ర్యాంక్‌ను సాధించాడు.

చిత్రం...నీట్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాజేష్