ఆంధ్రప్రదేశ్‌

హే... కృష్ణా !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 15: కృష్ణమ్మ ఆవిరైంది.. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలన్నీ నీటి ఎద్దడితో కటకటలాడుతున్నాయి. నది ఎగువ ప్రాంతంలో నీరు లేకపోవడంతో దిగువ ప్రాంతాలన్నీ నీటి కష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కృష్ణా పరీవాహక ప్రాంతాల్లోని అన్ని రిజర్వాయర్లలో నీరు డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం శనివారం నాటికి డెడ్ స్టోరేజ్‌కు చేరుకోబోతోంది. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఆరు టిఎంసిల నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్టల్ల్రో గత ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఆయా రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా అక్కడి నుంచి ఆశించినంత నీరు దిగువకు రాలేదు. ఈ ఏడాది 660 టిఎంసిల నీరు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లకు రావల్సి ఉంది. కేవలం 64 టిఎంసిల నీరు మాత్రమే దక్కింది. ఈ నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పంచుకోవలసి వచ్చింది. శ్రీశైలం రిజర్వాయర్‌లోని కొంత నీటిని రాయలసీమ ప్రాంతాలకు విడుదల చేశారు. అది కూడా అరకొరగా ఉంది. నాగార్జునసాగర్‌లోని నీటిని ప్రకాశం, గుంటూరు జిల్లాలకు విడుదల చేసినా అది ఏ మూలకూ చాలలేదు. ఈ రెండు జిల్లాల్లో కుంటలు, చెరువులు పూర్తిగా నిండలేదు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై శ్రీశైలం రిజర్వాయర్‌నుంచి ఆరు టిఎంసిల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఈ నీటిని సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏ విధంగా పంపిణీ చేయాలన్నది కృష్ణా బోర్డు నిర్ణయించనుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్‌లలో నీరు డెడ్ స్టోరేజ్‌ల్లోకి చేరుకుంటున్నాయి. ఏప్రిల్‌లోనే పరిస్థితి ఈ విధంగా ఉంది. మే, జూన్ నెలల్లో పరిస్థితి ఇంకేవిధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా

రిజర్వాయర్ గరిష్ఠ ప్రస్తుత గత ఏడాది
నీటిమట్టం నీటిమట్టం నీటిమట్టం
టిఎంసిలలో టిఎంసిలలో టిఎంసిలలో
ఆల్మట్టి 129.72 00 22.26
నారాయణపూర్ 37.65 00 17.16
జూరాల 117.24 43.19 71.37
తుంగభద్ర 100.86 3.70 2.61
శ్రీశైలం 215.81 24.36 32.56
సాగర్ 312.05 126.47 141.36
పులిచింతల 45.77 0.04 1.20

చిత్రం... ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం తగ్గిపోవడంతో బయటపడిన ఇసుక తినె్నలు