రాష్ట్రీయం

ఏజెన్సీలో హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం : ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు వరుస హత్యలకు పాల్పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ఈ నెల 28 నుంచి జరగనున్న నేపథ్యంలో మరిన్ని హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు అదనపు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తూ ఏజెన్సీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అమరవీరుల వారోత్సవాల పేరిట మావోలు నియామకాలు చేసుకుంటారనే సమాచారంతో గ్రామాల్లో యువతకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ మావోయిస్టులు పోస్టర్లు వేయడం, వారి వైఖరిని ఎండగడుతూ ఆదివాసీ సంఘాల పేరుతో కరపత్రాలు వెలుస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతంలో ఆధిపత్య పోరు వేడెక్కుతోంది. వారం క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్ ఎంపీటీసీ శ్రీనివాసరావును హతమార్చిన మావోయిస్టులు రెండ్రోజుల క్రితం విశాఖ జిల్లా చింతపల్లిలో ఇన్‌ఫార్మర్ల నెపంతో మరో ఇద్దరిని హత్య చేశారు. చర్ల మండలానికి చెందిన గిరిజనులను గతంలో అపహరించి వదిలిపెట్టారు. గత ఏడాది జూలై 24న ఇర్పా వెంకటేశ్వర్లు అనే గిరిజనుడిని ఇన్‌ఫార్మర్ పేరిట చంపేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఎమ్మెల్యే బీమా మాండవిని హతమార్చిన మావోలు మే 1న మహారాష్టల్రోని గడ్చిరోలిలో 16మంది జవాన్లను బలిగొన్నారు. గత పదిరోజుల్లో వరుస హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
విస్తరణకు మావోల యత్నం
ఇదిలావుండగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో కార్యకలాపాలు చేపట్టే బాధ్యతను హరిభూషణ్‌కు అప్పగించారని తెలుస్తోంది. భద్రాద్రి ఏజెన్సీలో చర్ల-శబరి ఏరియా, మణుగూరు-పాల్వంచ ఏరియా, వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీలు ఏర్పాటు చేశారు. చర్ల శబరి కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ భార్య శారద వ్యవహరిస్తున్నారు. ఈ దంపతుల పేరుతోనే ఎంపీటీసీ శ్రీనివాసరావు హత్యా ఘటనలో మావోలు లేఖ వదిలివెళ్లారు. అలాగే హరిభూషణ్, శారద మహబూబాబాద్ జిల్లావాసులు కావటంతో ఈ ప్రాంతంలో నియామకాలు జరుపుతారనే భావనతో గుండాల, ఆళ్ళపల్లి, కొత్తగూడ, జంగారం, కరకగూడెం, నర్సంపేట, బయ్యారం అటవీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గ్రామీణ ప్రాంత యువతను ఆకర్షించి తమ దళాల్లో చేర్చుకుంటారనే సమాచారంతో ముందస్తుగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.