రాష్ట్రీయం

ఎంసెట్ కౌనె్సలింగ్‌పై తొలగని సందిగ్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ఏపీ ఎంసెట్ కౌనె్సలింగ్‌పై సందిగ్ధత తొలగకపోవడంతో విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించాల్సి ఉన్నా ఇప్పటివరకూ కౌనె్సలింగ్ ప్రక్రియ ప్రారంభించక పోవడంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితిని గమనించి చాలామంది ఇతర రాష్ట్రాలకు, డీమ్డ్ వర్సిటీలకు వెళ్లిపోతున్నారు. వివిధ కారణాల వల్ల ఎంసెట్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తీరు విమర్శలకు గురవుతోంది. ఫలితాల వెల్లడి, కౌనె్సలింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువును మూడుసార్లు మార్చడం గమనార్హం. ఈ నెల 4 నుంచి చేసుకోవచ్చని ప్రకటించి మళ్లీ 8కి వాయిదా వేశారు. మళ్లీ 12 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని ప్రకటించారు. మరో 10రోజులు గడిచినా ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందో తెలియని దుస్థితి నెలకొంది. రాష్ట్ర శాసన మండలిలో ఎంసెట్ కౌనె్సలింగ్ ప్రక్రియ గురించి సభ్యులు ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం చర్చకు అనుమతించకపోవడం గమనార్హం. ఫీజుల వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో కౌనె్సలింగ్ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో 35వేల రూపాయల నుంచి 1.2 లక్షల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. గత ఏడాది కంటే 10శాతం ఫీజులను పెంచాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. పేద విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలో ఫీజు వ్యవహారం కొలిక్కి రాలేదు. ఫీజును పెంచాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తుండగా, అన్ని కళాశాలల్లోనూ 35వేల రూపాయలే ఫీజుగా నిర్ణయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీజుల పెంపుపై ఆచితూచి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. ఫీజుల పెంపు గురించి ఇంత మల్లగుల్లాలు పడే బదులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నిబంధనల మేరకు ఫ్యాకల్టీ, వసతులు ఉన్నాయో లేదో ఒక కమిటీ ద్వారా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. గత ఏడాది ప్రవేశాలు, ప్లేస్‌మెంట్స్, వసతలు, ఫ్యాకల్టీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫీజు నిర్ణయించాలని, నిబంధనలు పాటించకుంటే అనర్హత వేటు వేయాలని విద్యారంగ నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.