రాష్ట్రీయం

మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో సోమవారం జరుగనున్న వాదనలు, వివిధ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టేలు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ సచివాలయానికి వచ్చిన ఎస్‌కే జోషి, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావుతో సమావేశమయ్యారు. మున్సిపల్ వార్డుల విభజన, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లపై హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విష యం తెలిసిందే. వీటిపై సోమవారం హైకోర్టులో వాదనలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వాదనలను బలంగా వినిపించే అంశంపై సీఎస్ చర్చించారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ, రిజర్వేషన్ల ఖరారు అంశాలపై కూడా చర్చించారు. మున్సిపల్ వార్డులు, డివిజన్లు, రిజర్వేషన్ల ఖరారు తర్వాత షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనుండటంతో కసరత్తు చేయాల్సిందిగా మున్సిపల్ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి ఆదేశించినట్టు సమాచారం.
చిత్రం...సచివాలయానికి ఆదివారం వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, మున్సిపల్ శాఖ
ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్