రాష్ట్రీయం

కృష్ణా-గోదావరి అనుసంధానానికి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జూలై 21: కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని రాష్ట్ర విద్యాశాఖామంత్రి గుండకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అందుకు ఇంజనీర్ల సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో 19 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌తో పాటు కోటి రూపాయల వ్యయంతో 11వ వార్డులో నిర్మించ తలపెట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కోదాడ శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యుత్ సంక్షోభానికి ముగింపు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి ఇంచు భూమిని సస్యశ్యామలం చేసేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే కోటి యాభై లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారని అన్నారు. అదేవిధంగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిచేయడంతోపాటు గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగానికి నీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్నదే కేసీఆర్ తాపత్రయమని అందులో భాగస్వాములైన ప్రజలు రెండోమారు పట్టం కట్టారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే కోదాడ హైదరాబాద్ తరహాలో నందనవనంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నామని, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుతో కోదాడ పట్టణం దేదీప్యమానంగా వెలిగిపోతుందని అన్నారు.
చిత్రం...కోదాడలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌కు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి