రాష్ట్రీయం

టీబీపై నేడు అంతర్జాతీయ వర్క్‌షాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: టీబీ వ్యాధికి సంబంధించి తాజా పరిస్థితిపై చర్చించేందుకు సోమవారం ‘గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్-2019’ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు వర్క్‌షాప్ జరుగుతుందని ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ డాక్టర్ సుభాకర్ కంది తెలిపారు. మన దేశాన్ని 2025 సంవత్సరం వరకు టీబీ లేని దేశంగా మార్చాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, ఇందుకోసం వివిధ ఆసుపత్రులు, వైద్యుల బాధ్యత ఏమిటన్న దానిపై చర్చిస్తామన్నారు. సామాన్యులతో పాటు వైద్యులకు కూడా అవగాహన కల్పించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. 50 శాతం వరకు వైద్యులకు కూడా టీబీ పట్ల అవగాహన లేదని, అందుకే ఈ వర్క్‌షాప్ ఏర్పాటు చేశామన్నారు.