రాష్ట్రీయం

ఘరానా మొగుళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమంతా అనేక మంది యువతులు ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల మోజులో పడి మోసపోతున్నారు. ఎన్‌ఆర్‌ఐ పెళ్లి కొడుకుల మోసాలకు కళ్లెం వేసేందుకు కేంద్రం త్వరలో చట్టం తీసుకురానుంది. ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంటులో ఉంది. పంజాబ్, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక మంది యువతులు ఎన్‌ఆర్‌ఐ భర్తల ఆగడాలకు బలవుతున్నారు. ఈ బిల్లు అమలులోకి వస్తే ఎన్‌ఆర్‌ఐ పెళ్లికొడుకుల ఆగడాలకు ముకుతాడు వేయవచ్చు. భారతీయ యువతులను పెళ్లాడి విదేశాలకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఏదో పేరుతో భారత్‌కు పంపించి వేసి ఆ తర్వాత కనపడకుండా పోవడంతో కొత్త వధువులు సామాజికంగా తీవ్రమైన అభద్రతాభావానికి గురవుతున్నారు.
భార్యకు చట్టపరమైన విడాకులు ఇవ్వకుండా వదిలివేసినట్లయితే బాధ్యుడైన ఎన్‌ఆర్‌ఐ భర్త పాస్‌పోర్టును స్తంభింపచేస్తారు. ఈ వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. కోర్టు నోటీసులు జారీ చేసినప్పుడు హాజరుకాకుండా ఉంటే పాస్‌పోర్టును రద్దు చేస్తారు. ఆస్తులను జప్తు చేస్తారు. అందుకే ఎన్‌ఆర్‌ఐ పెళ్లి చేసుకోదలుచుకునే అమ్మాయిలు తప్పనిసరిగా 15 రోజుల్లోగా పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలి. ఇంతవరకు కేంద్రం 33 మంది ఎన్‌ఆర్‌ఐ భర్తల పాస్‌పోర్టులను రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా 4300 కేసులు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. భార్యలను మోసం చేసి పరారైన ఎన్‌ఆర్‌ఐ భర్తల కోసం లుకవుట్ సర్క్యూలర్లను జారీ చేస్తున్నారు. గత మూడేళ్లలో హైదరాబాద్ నుంచి 400 లుకవుట్ సర్క్యూలర్లను జారీ చేశారంటే పరిస్థితి తీవ్రత విదితమవుతుంది. విదేశాల్లో నక్కి అక్కడే నేరాలకు పాల్పడి ఉంటే ఆ భర్తపై ఎల్‌ఓసీ ఇచ్చే అధికారం ఇక్కడి నేరవిచారణాధికారికి అప్పగించనున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి, కేంద్రహోం, విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు ఉంటారు. ఇక్కడి కోర్టుల విచారణకు సమన్లు ఇస్తే రాకుండా తప్పించుకుని తిరిగితే వారి పాస్‌పోర్టులు రద్దు చేస్తారు. అందుకే పాస్‌పోర్టు చట్టంలో అవసరమైన సవరణలు చేస్తారు. విదేశాల్లో ఉన్న కోర్టుల్లో తమపై ఉన్న కేసులను ఎలా ఎదుర్కొనాలో తెలియక అనేక మంది భారతీయ వధువులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
గత రెండేళ్లలో తెలంగాణలో 195 కేసులు ఈ తరహాలో నమోదైనట్లు రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి చెప్పారు. గత ఏడాది 118 ఫిర్యాదులు రాగా, ఈ ఏడాది ఇంతవరకు 77 ఫిర్యాదులువచ్చాయని ఆ అధికారి చెప్పారు. పంజాబ్‌లో ఎక్కువగా 770 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు తమ దృష్టికి వచ్చినప్పుడు కేసు తీవ్రతను బట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పాస్‌పోర్టులను సస్పెండ్ చేయడం, కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోందన్నారు.