రాష్ట్రీయం

బీసీ ద్రోహులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 22: దేశంలోనే ఎక్కడా లేని విధంగా అణగారిన, దళిత వర్గాలు, మహిళలకు నామినేటెడ్ పదవులు.. కాంట్రాక్ట్ పనుల్లో భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడితే స్వాగతించాల్సింది పోయి ఈర్ష్యతో అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ప్రతిసారి గొప్పలు చెప్పుకునే ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగక పోవటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సోమవారం శాసనసభలో రాజధానికి ప్రపంచ బ్యాంక్ రుణం ఉపసంహరణపై చర్చ అనంతరం ఆరు బిల్లులు ప్రవేశపెట్టారు. అయితే అమరావతిపై చర్చను అర్ధంతరంగా ముగించారని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో సీఎం జగన్ జోక్యం చేసుకుని ప్రభుత్వం తరుపున వివరణ ఇచ్చిన తరువాత కూడా మరో అరగంట ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారని మళ్లీ అదే వాదన వినిపిస్తామనటం సమంజసం కాదన్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలతో జగన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి దిక్కుమాలిన ప్రతిపక్షం మరొకటిలేదని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే ఓర్వలేకే ఆందోళన చేస్తున్నారని ఆక్షేపించారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సంచలనాత్మక బిల్లును ప్రవేశపెడితే యువతకు ఉపాధిపై చర్చించాల్సిన ప్రతిపక్షం అక్కసుతో వెళ్లబోసుకుంటోందని ధ్వజమెత్తారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు తమ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని ఇది కూడా సహించలేని ప్రతిపక్షం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమన్నారు. తాము హుందాగా వ్యవహరిస్తున్నామని, అడిగిందే తడవుగా స్పీకర్ ప్రతిపక్షానికి కూడా నిబంధనల మేరకు అవకాశాలు ఇస్తున్నారని చెప్పారు. గతంలో మేం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాకు అవకాశం ఇవ్వకపోగా అవహేళన చేశారని గుర్తుచేశారు. అయితే తాము అంత నీచంగా వ్యవహరించబోమని, నియమావళి ప్రకారం ప్రభుత్వం వివరణ ఇచ్చిన తరువాత మరోసారి అదే అంశంపై ఎలా మాట్లాడతారని నిలదీశారు. బీసీ ద్రోహులుగా చరిత్రలో నిలుస్తారని విమర్శించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ బలహీన వర్గానికి చెందిన వారనేది కూడా గ్రహించకుండా ఆయన సీటు వద్దకు చేరి భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని, వారికి దేవుడే తగిన శాస్తి చేస్తాడని స్పష్టం చేశారు.

చిత్రం... సభలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి