రాష్ట్రీయం

ఆంధ్రుల అభిమానం మరువలేనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాష్ట్ర గవర్నర్‌గా తనపై ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం మరువలేనివని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నూతన గవర్నర్‌ను నియమించిన నేపథ్యంలో ఇంతకాలం రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగిన నరసింహన్‌కు స్థానిక గేట్‌వే హోటల్‌లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆత్మీయ వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా ఉండటం ఎంతో ఆనందం కలిగిందన్నారు. తనపైనా, తన సతీమణి విమలా నరసింహన్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించిన ఆరదాభిమానాలు వెలకట్టలేనివని వాటిని తాము కోల్పోతున్నామనే బాధ కలుగుతుందన్నారు. గవర్నర్‌గా బాధ్యతలను పూర్తిగా నేరవేర్చాననే సంతృప్తి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేయడం ద్వారా అధికారం చేపట్టినప్పుడు తనకు త్యాగరాజస్వామి కీర్తనలో ఒక పాట ‘నను పాలించగా నడిచి వచ్చితివా’ గుర్తుకువచ్చిందన్నారు. ఆ విధంగానే రాష్ట్రాన్ని పాలించడానికి జగన్ నడిచివచ్చారన్నారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వైఎస్ జగన్ రానున్న ఐదేళ్లు రాష్ట్భ్రావృద్ధికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్రంలో ఐఎఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ తదితర అధికారులు అందించిన సహకారం ఎంతో ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్ సేవలను ఆయన అభినందించారు. తాను తెలిసీ తెలియక ఏమైనా తప్పులు చేస్తే వాటిని ఆంధ్ర ప్రజలు మన్నించాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నరసింహన్ రాష్ట్ర గవర్నర్‌గా విడిచి వెళ్లుతున్న సమయం మనస్సులో ఒక వైపు బాధకలుగుతుందని అయితే పక్క రాష్ట్రంలోనే గవర్నర్‌గా ఉన్నారనే ఆనందం కూడా కలుగుతుందన్నారు. ఇంకా గవర్నర్‌గా కొనసాగి ఐదేళ్లు నడిపిస్తే బాగుండేదనే భావన కలుగుతుందన్నారు. తొలుత సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి గవర్నర్ నరసింహన్ దంపతులను దుశ్శాలువాతో సత్కరించి వెంకటేశ్వరస్వామి విగ్రహం, ఆంధ్ర రుచులతో కూడిన స్వీట్లు అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గవర్నర్‌ను శాలువాతో సత్కరించి నరసింహస్వామి చిత్రపటాన్ని అందజేశారు. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, డీజీపీ గౌతం సవాంగ్, గవర్నర్ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు, శాసనమండలి చైర్మన్ ఎంహెచ్ షరీఫ్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పీ విశ్వరూప్, వెలంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, ఆవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... గవర్నర్ దంపతులను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి దంపతులు