రాష్ట్రీయం

చింతమడకకు వరాల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి/ సిద్దిపేట, జూలై 22: ప్రేమ, అనురాగం, ఆప్యాయతలను కలబోసుకుని అన్నివర్గాల వారు ఐకమత్యంగా గ్రామాభివృద్ధికి నడుం బిగిస్తే అనతికాలంలోనే చింతమడక ఓ బంగారు తునకగా మారుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. చిన్నచిన్న గొడవలు, పంచాయతీలు ఉంటే వాటిని పక్కన పెట్టాలని హితవు పలికారు. తన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామ ప్రజలతో సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రశేఖరరావు గ్రామ ప్రజలను పేరుపేరునా పలకరిస్తూ కరచాలనం చేశారు. అందరినీ ఆకట్టుకుంటూ వినతిపత్రాలను స్వీకరించారు. గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బీమా పథకం రాష్ట్రంలో అమలవుతోందని ప్రకటించారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ. 5 లక్షల సహాయం కుటుంబానికి అందుతుందన్నారు. ‘దేశం విషయం అటుంచితే మన గ్రామానికి వస్తే చింతమడక గ్రామానికి బ్రహ్మాండమైన వాస్తు ఉంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాన తటాకాలతో గ్రామం ఏర్పడింది’ అని చెప్పారు. చిన్నప్పడు గ్రామంలో ఊటలు వచ్చేవి, ఆ ఊటలు, జలాలు ఎక్కడపోయాయో అంటూ విచారం వ్యక్తం చేసారు. ప్రస్తుతం కాళేశ్వరం దూకుతోందని, ఏడాదిలోగా దమ్ము చెరువు నిండటంతో మళ్లీ ఊటలు వస్తాయన్నాని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. చింతమడక గ్రామానికి కనీసం రోడ్డు కూడా ఉండేదికాదని, బాలకిషన్ కాక సర్పంచ్ అయ్యా క రోడ్డు ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా గూడురులో చిన్నప్పుడు తన అక్క ఇంట్లో ఉండి బట్టు పంతులు దగ్గర విద్యాభ్యాసం చేసినట్టు కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. గజ్వేల్
ఎమ్మెల్యేగా ఉండి ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని, ప్రతి ఇంట్లో 24 గంటలు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతోందన్నారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం ఉందని తెలిపారు. అదే తరహాలో చింతమడక గ్రామం కూడా అభివృద్ధి సాధించాలని సీఎం ఆకాంక్షించారు. చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల్లో మొత్తం 1,804 కుటుంబాలు ఉన్నాయని, వీటిని 2 వేలుగా భావించుకోవాలని, వలస పోయిన వారిని పిలిపించి వారికి కూడా లబ్ధి చేకూర్చాలని సూచించారు. చింతమడకలో ఎవరూ ధనికులు లేరని, అందరూ అప్పుల పాలైన విషయం తనకు తెలుసని అందుకే ప్రతి ఇంటికి రూ.10 లక్షల పథకాన్ని తీసుకువచ్చినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. రూ.10 లక్షల లాభం చేకూర్చాలని, ఏదైనా పథకం కింద రూ.8 లక్షల లబ్ధి చేకూరితే ఊరుకోవద్దని, మిగిలిన రూ.2 లక్షలు కూడా అందాలన్నారు. ‘ఈ ఊరి మట్టిలో పుట్టి ప్రజల కాళ్లలో, రెక్కల్లో, తిరిగిన బిడ్డగా ఎవరికీ అన్యాయం జరగనివ్వను. అన్ని కుటుంబాలకు రూ.10 లక్షల లబ్ధి చేకూరుస్తాం’ అని చెప్పారు. యువకులు వరినాటు యంత్రాలు, వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను కొనుగోలు చేసుకుని ఉపాధి పొందాలన్నారు. ఆవులు, గేదెలను ఖరీదు చేసుకుని పాల ఉత్పత్తిని చేస్తే ఇక్కడ పాలశీతలకీరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల్లో 1500 నుండి 2వేల వరకు ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. గ్రామ ప్రజలు సంఘాలుగా ఏర్పడి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. వచ్చే కార్తీక మాసం నాటికి తన కోరికను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. చింతమడక తనకు పాలిచ్చి పెద్దచేస్తే గూడురు, పుల్లూరు, తోర్నాల, దుబ్బాక విద్యాబుద్దులను నేర్పించాయన్నారు. చిన్నప్పటి గురువు మృత్యుంజయశర్మ చెప్పిన పద్యాన్ని ఐదుసార్లు చదివి అప్పగించి 200 పేజీల నోటుబుక్కును బహుమతిగా గెలుచుకున్నానని గుర్తు చేసుకున్నారు. తనలోని ప్రతిభను గుర్తించి మాస్టారు పదో తరగతి వచ్చే సరికి స్వతహాగా పద్యాలు రాసే స్థాయికి తీసుకువచ్చారని కొనియాడారు. ఓంకారం పెట్టి, రాజకీయంగా పెంచిన సిద్దిపేట గడ్డకు చెందిన ప్రతి ఒక్కరూ తనకు ఆత్మీయ బంధువులే అన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. సిద్దిపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, త్వరలోనే రైలు కూడా వస్తుందని, ఒక్క విమానం ఎగరడమే తక్కువగా ఉందన్నారు.
ఇక్కడి నుంచే తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌కు శ్రీకారం
చింతమడక గ్రామస్తుందరికీ ఉచిత కంటి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారిలో సమస్యలుంటే సర్కార్ ఖర్చుతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గ్రామస్తులందరి ఆరోగ్య, రక్త పరీక్షలో ఆరోగ్య సూచికను సిద్ధం చేయాలని సూచించారు. చింతమడక ప్రజల హెల్త్‌ప్రొఫైల్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ప్రజల హెల్ తప్రొఫైల్‌ను తయారుచేసే ఆలోచన ఉందన్నారు. చింతమడక అభివృద్ధికి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. చింతమడక అభివృద్ధికి 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కలెక్టర్ వద్ద ఉంటాయని, ఏ అభివృద్ధికైనా నిధులు వినియోగించుకోవచ్చన్నారు.
అంతకుముందు సభాధ్యక్షుడు హరీష్‌రావు మాట్లాడుతూ చేసిన విజ్ఞప్తుల మేరకు సిద్దిపేట నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ, సర్పంచ్, ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు.. చింతమడక ఆత్మీయ అనురాగ సమ్మేళన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్