రాష్ట్రీయం

ఎస్‌ఐ ఫలితాలు విడుదల చేసిన సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 22: సబ్ ఇన్స్‌పెక్టర్ల పరీక్షా ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఫలితాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు నెలల తరబడి ఎదురుచూస్తున్న తరుణంలో వారి అభ్యర్థన మేరకు అసెంబ్లీ ఛాంబర్‌లో ముఖ్యమంత్రి ఫలితాలు విడుదల చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్లు (సివిల్, రిజర్వు, ఏపిఎస్పీ), డిప్యూటీ జైలర్లు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ల పోస్టులకు సంబంధించి మొత్తం 333 ఖాళీల ఎంపికలో రాత పరీక్షకు సంబంధించి తుది ఫలితాలను రాష్ట్ర స్ధాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. మొత్తం 1,35,414 మంది అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పోటీ పడగా, ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ పరీక్షలు పూర్తయ్యాక అందులో అర్హత పొందిన 32,745 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. వీరంతా 149 సివిల్ ఎస్‌ఐలు, 75 రిజర్వు ఎస్‌ఐ పోస్టులకు అదేవిధంగా 75 ఏపీ స్పెషల్ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు, 10మంది డిప్యూటీ జైలర్లు (పురుషులు), నాలుగు మహిళా డిప్యూటీ జైలర్లు, 20 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు పోటీ పడ్డారు. కాగా నెల్లూరుకు చెందిన పరుచూరి రమేష్, కడపకు చెందిన షేక్ హుస్సేన్, రవికిషోర్ 255 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. 15,775 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడగా 61మంది ఎంపిక అయ్యారు. కృష్ణాజిల్లాకు చెందిన విశ్వనాధపల్లి ప్రఙ్ఞ 224 మార్కులతో మహిళల్లో టాపర్‌గా నిలిచారు. ధృవ పత్రాలు వెరిఫికేషన్ పూర్తయ్యాక ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైన వారికి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఫలితాలు విడుదల సందర్భంగా ముఖ్యమంత్రితోపాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ దామోదర గౌతం సవాంగ్, అదనపు డీజీ కుమార్ విశ్వజిత్ ఉన్నారు. ఎస్‌ఐ రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల సర్ట్ఫికెట్లు పరిశీలన అనంతరం త్వరలో శిక్షణకు పంపనున్నట్లు హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. పోలీసుశాఖలో ఖాళీల భర్తీకి త్వరలో ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడతామన్నారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి ఫలితాలు విడుదల చేసిన అనంతరం హోంమంత్రి మీడియా పాయింట్‌లో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని పోలీసుశాఖలో ఇంకా 17శాతం వివిధ కేటగిరీల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందన్నారు.