రాష్ట్రీయం

పాత ఫీజులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఫీజుల ఖరారు వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ఎంసెట్ కౌనె్సలింగ్‌లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్న నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది వసూలు చేసిన ఫీజులనే ఈ ఏడాది కూడా వసూలు చేయాలని ఆదేశించడంతో ఎంసెట్ కౌనె్సలింగ్‌కు మార్గం సుగమమైంది. తల్లితండ్రులు, విద్యార్థుల నుంచి ఫీజు తగ్గింపుపై వచ్చిన వినతులు, విద్యా రంగంలో సంస్కరణలకు కమిటీ నియామకం, ఉన్నత విద్యను పూర్తిగా సంస్కరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఫీజుల ఖరారులో జాప్యం అవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బిఆర్క్, బిఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు గత ఏడాది వసూలు చేసిన ఫీజులనే ఖరారు చేసింది. 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.