రాష్ట్రీయం

ఈ మార్పులు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : శాసనసభ, మండలి ఉభయ సభలు ఆమోదించిన మున్సిపల్ చట్టంలోని కొన్ని క్లాజ్‌ల పట్ల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న క్లాజ్‌లు తొలగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. దీంతో గవర్నర్ సూచనల మేరకు కొన్ని సవరణలతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. చట్టంలో చేసిన సవరణలకు ఆమోదించడానికి శాసనసభ ప్రోరోగ్ కావడంతో విధిలేని పరిస్థితిలో ప్రభుత్వానికి ఆర్డినెన్స్ జారీ చేయకతప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరించడం ఇదే తొలిసారిగా భావించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం కమీషనర్ల నియామకంలో కొందరి పేర్లకు కూడా గవర్నర్ అభ్యంతరం తెలిపిన సందర్భం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ నిర్ణయంతో గవర్నర్ విభేదించడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇలా ఉండగా శాసనసభ ఆమోదించిన రెండు చట్టాలలో ఒక చట్టానికి యధాతధంగా ఆమోదం తెలిపిన గవర్నర్, రెండో చట్టానికి మాత్రమే సవరణలు సూచించారు. మొదటి చట్టంలో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు, వార్డుల విభజనకు సంబంధించింది. దీనిని యధాతధంగా ఆమోదించడంతో న్యాయశాఖ సోమవారమే గెజిట్ జారీ చేసింది. మున్సిపల్ పాలక వర్గాల విధివిధానాలకు సంబంధించిన రెండో చట్టంలో సవరణలకు ఆమోదం లభించాల్సి ఉండటంతో దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో మున్సిపల్ కొత్త చట్టం కొన్ని స్వల్ప సవరణలతో అమలులోకి వచ్చింది. ఉభయ సభలు ఆమోదించిన మున్సిపల్ చట్టం గవర్నర్ ఆమోదానికి వెళ్లినప్పుడు కొన్ని క్లాజ్‌లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇవీ రాజ్యాంగ విరుద్దంగా ఉన్నట్టు భావించి న్యాయ నిపుణులతో గవర్నర్ చర్చించినట్టు సమాచారం. ఇందులో హరితహారంలో నాటిని మొక్కలలో 85 శాతం ఎండిపోయినట్టు అయితే దానికి బాధ్యులుగా వార్డు సభ్యులను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందనే దానిపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే మున్సిపల్ ఎన్నికల తేదీలను ఖరారు చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్న దానిపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు చేసినట్టు తెలిసింది. ఈ రెండింటికి గవర్నర్ సవరణలు సూచించారు. అలాగే మున్సిపల్ బిల్లు ముసాయిదాలో మరికొన్ని సవరణలను సభలో ముఖ్యమంత్రి సూచించారు. వాటిలో 75 గజాల లోపు స్థలంలో అనుమతి లేకుండా జి ప్లస్ వన్ నిర్మించుకోవచ్చు అనే క్లాజ్‌కు సవరణలు సూచించారు. అలాగే బాదేపల్లి మున్సిపాలిటీ పేరును జడ్చర్ల మున్సిపాలిటీగా పేరు మార్చుతూ మరో సవరణను సూచించారు. వీటతో పాటు గవర్నర్ చేసిన సూచనలకు తిరిగి సభ ఆమోదం పొందడానికి అసెంబ్లీ ప్రోరోగ్ కావడంతో ఆర్డినెన్స్ జారీ చేయక తప్పలేదు.