రాష్ట్రీయం

ఉన్నత విద్యకు దిద్దు‘బాట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యకు దిశనూ, దశనూ సూచించేందుకు ఉన్నత విద్యా మండలి ఉన్న అన్ని అవకాశాలనూ అనే్వషిస్తోంది. యూనివర్శిటీలు, కాలేజీల మధ్యపోటీ తత్వాన్ని పెంచడంతో పాటు ప్రభుత్వ యూనివర్శిటీలు, కాలేజీల్లో వౌలిక సదుపాయాలను పెంచడం, ఖాళీలను భర్తీచేయడంతో పాటు నూతన పాఠ్యప్రణాళికలను అమలుచేయడం, జాతీయ బోర్డుల గుర్తింపు పొందడం , వార్షిక ప్రణాళికను గాడిలో పెట్టడం, తుదకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇంత వరకూ గుర్తింపు లేని కాలేజీలను చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడమేగాక, నేక్ గుర్తింపు తీసుకునే కాలేజీలకు ఆర్ధిక సాయం కూడా చేస్తామని ప్రకటించింది. మరో పక్క యూనివర్శిటీల్లో పాలనపై దృష్టిసారించింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శిగా డాక్టర్ జనార్ధనరెడ్డి వచ్చిన తర్వాత యూనివర్శిటీల్లో దురవస్థపై యూనివర్శిటీ టీచర్ల సంఘం ఔటాతో పాటు వర్శిటీ టీచర్ల ఫెడరేషన్ సైతం సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాయి. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నా, అనుకున్న లక్ష్యాలను మాత్రం యూనివర్శిటీలు నెరవేర్చలేకపోతున్నాయి. కొత్తగా వీసీల నియామకాలు చేపట్టాలంటే వర్శిటీలను గాడిలో పెట్టాలని భావించిన జనార్ధనరెడ్డి ప్రతి యూనివర్శిటీ నుండి నివేదికలను తెప్పించుకున్నారు. త్వరలోనే వైస్ ఛాన్సలర్ల భేటీని కూడా నిర్వహించబోతున్నారు. ఇటీవలె నేక్ గుర్తింపునకు సంబంధించిన అంశాలపై సదస్సు నిర్వహించి యూనివర్శిటీల ప్రతినిధులను, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను ఆహ్వానించి గుర్తింపు ప్రక్రియపై అవగాహన కల్పించారు. మరో పక్క వివిధ సంస్థల ప్రతినిధులు , విద్యానిపుణులతో ప్రమాణాల పెంపు, అన్ని వర్గాల విద్యాసంలీనంపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డితో పాటు మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు, మండలి సభ్యుడు ప్రొఫెసర్ ఒఎన్ రెడ్డి, ఎం గోపాలకృష్ణ, మాజీ వీసీ ప్రొఫెసర్ టీ తిరుపతిరావు, ప్రొఫెసర్ ఏ రవీంద్రనాధ్, ఐఎస్‌బీ మాజీ డీన్ అజిత్ రంగేకర్, ప్రొఫెసర్ మెండు రామమోహన్‌రావు, తేజ్ ఎండీ డాక్టర్ నందితా సేథీ, గాయత్రీ సుగర్స్ ఎండీ సరితారెడ్డి, ఇండో అమెరికా స్టడీస్ చైర్మన్ నాగేంద్ర పులమాటి, టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ వీ రాజన్న, సీఐఐ ప్రతినిధి అరుణ వంటి హేమాహేమీలు హాజరై రాష్ట్రంలో ఉన్నత విద్య దిశను సూచించారు.
బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధి బృందం రాష్ట్రానికి వచ్చినపుడు వారితో విద్యా మంత్రి జగదీష్‌రెడ్డి చర్చించడంతో పాటు టీచర్ల సామర్ధ్యాల పెంపు, అంతర్జాతీయకరణ, ఉన్నత విద్య ద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రోత్సాహాన్ని అందించడం, నవీకరణ పద్ధతులపై కూడా చర్చించారు. జనవరిలో లండన్‌లో జరిగే ఎడ్యుకేషన్ వరల్డ్ ఫోరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి బృందం పాల్గొనేందుకు ఉన్న అవకాశాలపై కూడా చర్చించారు.
ఇంకో పక్క విశిష్ట ఉపన్యాసాలను ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేస్తోంది. జూలై 29వ తేదీన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ విశిష్ట ఉపన్యాసాల పరంపరను ప్రారంభించనున్నారు. తొలి ఉపన్యాసం ప్రొఫెసర్ జగదీష్ ఎన్ సేథీ ఇస్తారు. అమెరికాలోని ఎమరీ యూనివర్శిటీ గిజుట బిజినెస్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్న సేథీ నూతన ప్రపంచంలో భారత్- తెలంగాణకు ఉన్న అవకాశాలు అనే అంశంపై మాట్లాడతారు. సేథీ ఉపన్యాసానికి ఇక్ఫాయి సంస్థ సహకరిస్తోందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు.