రాష్ట్రీయం

ఇంజనీరింగ్ కాలేజీల్లో మరో 28 వేల సీట్ల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన 28,187 సీట్ల భర్తీకి తుది విడత కౌనె్సలింగ్‌ను ఈ నెల 24న ప్రారంభిస్తున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. 24 నుండి రెండు రోజుల పాటు అభ్యర్ధుల రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. 26న సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుందని, 24 నుండి 27 వరకూ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని, 29వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. సీట్లు పొందిన వారు కాలేజీలకు అనుగుణంగా 29వ తేదీ నుండి 31వ తేదీలోగా ఫీజు చెల్లించాలని, అనంతరం వారు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఆయన చెప్పారు. తొలి విడతలో 16,432 సీట్లు మిగిలిపోయాయి, అయితే సీట్లు పొందిన వారు సైతం 11,755 మంది కాలేజీల్లో రిపోర్టు చేయలేదు. దాంతో రెండో విడతకు 28187 సీట్లు మిగిలిపోయాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 4739, కంప్యూటర్‌సైన్స్ ఇంజనీరింగ్‌లో 4952, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 6232, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 4880, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 765, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 5871 సీట్లు మిగిలాయి.
నేడు ఇంటర్ ఫస్టియిర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫస్టియిర్ ఫలితాలను బుధవారం నాడు ఉదయం 11.30 గంటలకు బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ విడుదల చేయనున్నారు. ఫలితాలను బోర్డు వెబ్ పోర్టల్‌లోనూ, బిఐఈ డాట్ తెలంగాణ డాట్ జీవోవీ డాట్ ఇన్ లోనూ ఉంచుతామని, అదే విధంగా రిజల్ట్స్ డాట్ సీజీజీ డాట్ జీవోవీ డాట్ ఇన్‌లోనూ అందుబాటులో ఉంటాయని అన్నారు. వీటికి తోడు మొబైల్‌ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చని వారు చెప్పారు.