రాష్ట్రీయం

రాజధాని నిర్మాణ పనులు ఆపలేదు: మంత్రి బొత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఆపలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అవినీతి జరిగిందన్న ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాజధాని పరిధిలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అధికారులకు నిర్మిస్తున్న గృహ సముదాయాల నిర్మాణ పురోగతిపై టీడీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. 25 శాతంలోపు జరిగిన పనులనే ఆపమని ఆదేశించామని, మిగిలిన పనులను ఆపమని చెప్పలేదన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. టెండర్ ప్రక్రియపై ఆరోపణలు రావడంతో నిపుణల కమిటీని నియమించామన్నారు. కమిటీ నివేదికలో ఏ మేరకు అవినీతి జరిగిందో తేలుతుందన్నారు. అవినీతికి అడ్డుకట్ట వేయడం ద్వారా వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని, నాలుగు రోజులు ఆలస్యమైతే ఏమి అవుతుందని ప్రశ్నించారు. సచివాయల నిర్మాణానికి చెల్లింపులు అంశాలన్నీ త్వరలో బయటపెడతామన్నారు. న్యాయమూర్తులు, మంత్రుల నివాసాల నిర్మాణం 24 శాతం, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శల గృహాల నిర్మాణం 24.5 శాతం, 18 టవర్లలో 432 అపార్టుమెంట్లు 72 శాతం మేర పూర్తయ్యాయన్నారు.