రాష్ట్రీయం

మా తడాఖా చూపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన తడాకా చూపెడుతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ జైత్రయాత్రను ఎవరూ అడ్డుకోలేరని, టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పనున్నారని ఆయన జోస్యం చెప్పారు. గురువారం గాంధీ భవన్‌లో మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ తెలిపారు. బీసీల రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు
ఇవ్వాలన్నారు. ఇంటింటికీ కాంగ్రెస్, వాడవాడలా జెండా కార్యక్రమం విజయవంతమైందని ఆయన ప్రకటించారు. మున్సిపాలిటీల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19వ తేదీ వరకు జెండా పండగను కొనసాగించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇంటింటికీ, వాడవాడల్లో కాంగ్రెస్ పార్టీ విస్తరించిందని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ 75వ జయంతి ఘనంగా జరుపుకోవాలని ఆయన కార్యకర్తలను కోరారు. బీజేపీ నేతలు పార్లమెంటులో తెలంగాణ ఇవ్వడం తప్పు అనే రీతిలో మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానించారన్నారు. ఏ బిల్లు ఆమోదానికైనా పార్లమెంటు తలుపులు మూయిస్తారన్నారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్‌ను విభజించారన్నారు. లోక్‌సభలోప్రధాని మోదీ కూడా గతంలో ఇదే విషయంలో తప్పుబట్టడాన్ని ప్రజలు గమనించారన్నారు. బీజేపీ నేతలు తెలంగాణను అవమానిస్తూ ప్రకటనలు చేస్తుంటే, టీఆర్‌ఎస్ ఎందుకు వౌనంగా ఉందని ఉత్తమ్ నిలదీశారు.