రాష్ట్రీయం

గాంధీ, నీలోఫర్‌లో సూపర్ స్పెషాలిటీ బ్లాకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, నీలోఫర్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ బ్లాకులు కేటాయించటంతోపాటు వాటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అంగీకరించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాజేందర్ గురువారం హర్షవర్దన్ తదితర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య సంబంధం అంశాల గురించి చర్చించారు. ఖమ్మం, కరీంనగర్‌లో రెండు మెడికల్ కాలేజీల స్థాపనకు అనుమతి మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య సంబంధ పథకాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని హర్షవర్దన్ హామీ ఇచ్చారని రాజేందర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లో నిర్మించిన రెండు సూపర్ స్పెషాలిటీ బ్లాకులను త్వరలోనే రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తుందని రాజేందర్ కేంద్ర మంత్రితో చెప్పారు. ఇలాంటి మరో రెండు సూపర్ స్పెషాలటీ బ్లాకులను గాంధీ ఆసుపత్రి-మెడికల్ కాలేజీ, నీలోఫర్ ఆసుపత్రిలో నిర్మించాలనుంటున్నాం.. వీటికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని రాజేందర్ అడిగారు. తెలంగాణలో తమ ప్రభుత్వం చేపట్టిన వైద్య ఆరోగ్య పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని హర్షవర్దన్‌కు విజ్ఞప్తి చేసినట్లు రాజేందర్ తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం తొమ్మిది మెడికల్ కాలేజీలున్నాయి.. వీటికి తోడుగా ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో మెడికల్ కాలేజీల స్థాపనకు అనుమతి ఆవ్వాలని కోరగా హర్షవర్దన్ సానుకూలంగా స్పందించారని రాజేందర్ చెప్పారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో జిల్లా ఆసుపత్రుల స్థాయి పెంచేందుకు ఎన్‌హెచ్‌ఎం కింద ఆర్థిక సహాయం చేయాలని కోరాం.. నిర్మల్, మహబూబాబాద్, నర్సంపేట్ తదితర తొమ్మిది కొత్త జిల్లాల ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేసేందుకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా హర్షవర్దన్‌ను కోరాం.. ఆయన సానుకూలంగా స్పందించారని రాష్ట్ర మంత్రి తెలిపారు. తెలంగాణలోని మరిన్ని ఆసుపత్రుల్లో డయాలసిస్ యంత్రాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయాలని విన్నవించాం.. దీనితోపాటు రాష్ట్రంలో ఐసీయూ కేంద్రాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఈటల తెలిపారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ట్రామా కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని కోరాం.. పేద ప్రజలకు ఉపయోగపడే కేసీఆర్ కిట్టు మంచి ప్రయోజనాలు ఇస్తోందని.. ఇలాంటి పథకాలను కేంద్రం ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కేంద్ర మంత్రికి సూచించామన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి.. కేసీఆర్ కిట్టుకు కూడా సహాయం చేయాలని కోరామని చెప్పారు. హైదరాబాదులో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని రాజేందర్ చెప్పారు. వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.. దీనికి ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఈ సంవత్సరం నుంచి పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఒక సైన్స్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని హర్షవర్దన్‌ను కోరామన్నారు.