రాష్ట్రీయం

వరద బాధితులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుకొండ, ఆగస్టు 8: వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి వరద ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం హెలికాఫ్టర్ నుండి పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసన సభ్యులు, ఎంపీలు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు రూ.5000, పాతిక కేజీల బియ్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికార్లకు సూచించారు. పంట నష్టపోయిన రైతులకు నిబంధనల మేరకు పరిహారం చెల్లింపునకు తగిన ఏర్పాట్లుచేయాలన్నారు. నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు కూడా అందించే విధంగా చూడాలన్నారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), వ్యవసాయ శాఖ
మంత్రి కురసాల కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ఎమ్మెల్యేలు నాగులాపల్లి ధనలక్ష్మి, జక్కంపూడి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, ద్వారంపూడి చంద్రశేఖర్, కలెక్టర్లు మురళీధర్‌రెడ్డి, ఆర్ ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్లు లక్ష్మీశ, వేణుగోపాలరెడ్డి, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ సుమిత్‌కుమార్ గాంధీ, సబ్-కలెక్టర్ మహేష్‌కుమార్, రంపచోడవరం ఐటీడీఏ పీవో నిశాంత్‌కుమార్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరుూం అస్మీ తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.