రాష్ట్రీయం

శోభాయమానం వరలక్ష్మీవ్రతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 9: సిరులతల్లి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్మీవ్రతం వైభవంగా జరిగింది. వరలక్షీవ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవరులకు, ఉత్సవరులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి, మొగలిరేకులు వంటి సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. ఆస్థానమండపాన్ని అష్టలక్ష్మీ మూర్తులతో, రోజాలు, తామరపూలు వంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 9గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కోగ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. అనంతరం వేంకటాచల మహత్యం, స్కాందపురాణంలో సూత మహర్షి వివరించిన వరలక్ష్మీవ్రతం మహాత్యాన్ని చారుమతి అనే భక్తురాలి భక్తిప్రపత్తిని కథారూపంలో ఆలయ ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాసాచార్యులు భక్తులకు తెలియజేశారు. తరువాత 12రకాల విశేష నివేదన సమర్పించారు. అనంతరం మంగళహారతితో వరలక్ష్మీవ్రతం ముగిసింది. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవరించిన దివ్యస్థలం తిరుచానూరులో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆలయం వద్ద ఉన్న ఆస్థాన మండపంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారని తెలిపారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా ఆలయం వద్ద ఉన్న ఆస్థానమండపంలో భక్తులను ఆకట్టుకునేలా వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్‌దీపాలతో అలంకరించారన్నారు. భక్తులకు సౌకర్యార్థం ఆస్థానమండపంలో నాలుగు, ఊంజల్‌మండపంలో ఒకటి, తోళ్లప్ప గార్డెన్‌లో ఒకటి కలిపి మొత్తం ఆరు ఎల్ ఇ డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆద్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు.
అదే విధంగా తిరుచానూరు విచ్చేసే వేలాది మంది భక్తులకు కంకణాలు, పసుపు ధారాలు, పసుపు, కుంకుమ, రెండులక్షల గాజుల పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ పర్వదినాన అమ్మవారికి బంగారుచీరతో విశేషాలంకరణ చేసినట్లు వివరించారు. సాయంత్రం అమ్మవారు స్వర్ణరథోత్సవంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.