రాష్ట్రీయం

బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జీ వెంకటస్వామి కుమారుడు మాజీ ఎంపీ జీ వివేక్ శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావునిరంకుశ రాజకీయాలతో విసిగిపోయిన వివేక్ శుక్రవారం బీజేపీలో చేరారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. కేసీఆర్ తన ఇంట్లో డైనింగ్ టేబుల్ పై నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున విస్తరిస్తోందని ఆయన అన్నారు. వివేక్ లాంటి పలువురు మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులు బీజేపీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ
ప్రజలు సీఎం కేసీఆర్ పాలనతో విసిగిపోయారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి తుగ్లక్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని బీజేపీలో చేరిన వివేక్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశ రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మార్చినట్లు చంద్రశేఖరరావు రాష్ట్ర సచివాలయాన్ని మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వ్యయాన్ని విపరీతంగా పెంచి ఈ డబ్బును ఇతర రాష్టల్ల్రో ఎన్నికల కోసం ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తన పలుకుబడిని పెంచుకునేందుకే ఇలా చేస్తున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తమలాంటి వాళ్లు పోరాడితే దాని ప్రతిఫలాలు ఆయన అనుభవిస్తున్నారని వివేక్ ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించటంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యాయరని వివేక్ అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలు నచ్చకే బీజేపీలో చేరినట్టు ఆయన వెల్లడించారు. నియంతగా వ్యవహరిస్తున్న చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించవలసిన అవసరం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా వివేక్ చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని లక్ష్మణ్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల దేశ ప్రజల విశ్వాసం పెరుగుతోందని ఆయన తెలిపారు.