రాష్ట్రీయం

ఒన్ నేషన్.. ఒన్ రేషన్ కార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: దేశంలో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వారికి ఆహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన ‘ ఒన్ నేషన్.. ఒన్ రేషన్ కార్డు’ విధానం అమల్లోకి వచ్చింది. ఒకే దేశం, ఒకే కార్డు పేరుతో ఏ రాష్ట్రంలోని పేదలైనా దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేందుకు వీలుగా కేంద్రం జాతీయ పోర్టబిలిటీ విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా తొలి విడతగా నాలుగు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని ఆదర్శనగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని రేషన్ షాపును ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. పంజాగుట్టలో వాచ్‌మెన్‌గా
ఉంటున్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వర్ రావుజాతీయ పోర్టబిలిటీ విధానాన్ని ఉపయోగించుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషన్ అకున్ సబర్వాల్ సమక్షంలో ఐదు కిలోల బియ్యాన్ని తీసుకున్నారు. కేంద్రమంత్రి పాశ్వాన్ మాట్లాడుతూ తెలంగాణలో పోర్టబిలిటీ విధానం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పోర్టబిలిటీ విధానం గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నామన్నారు. గత 14 నెలల్లో దాదాపు రెండు కోట్ల మందికి పైగా పోర్టబిలిటీ ద్వారా సరుకులు తీసుకున్నామన్నారు. ప్రజా పంపిణీకి సరిపడినన్ని బియ్యాన్ని తామే సమకూర్చుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఇక్కడే సరఫరా చేస్తున్నామన్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు కూడా ఎఫ్‌సీఐ ద్వారా బాయిల్డ్ రైస్‌ను పంపిస్తున్నామన్నారు. బియ్యం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడడం లేదన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని రేషన్ లబ్ధిదారులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చన్నారు. ఆంధ్ర వివరాలను తెలంగాణలో, తెలంగాణ వివరాలను ఆంధ్రాలో ఈ పాస్ యంత్రాలకు ఎన్‌ఐసీ సహకారంతో అనుసంధానం చేశామన్నారు. దీంతో ఆంధ్ర వారు ఇక్కడికి వచ్చి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే వేలి ముద్ర వేసినా, లేదా ఐరిస్ ఉపయోగించి అయినా సరుకులు తీసుకోవచ్చన్నారు.
ఆహార భద్రత చట్టం పరిధిలో జారీ చేసిన కార్డులకే జాతీయ పోర్టబిలిటీ విదానం వర్తిస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి బియ్యం కిలో రూ.3 చొప్పున ఐదు కిలోలు, గోధుమలు కిలో రూ.2 చొప్పున 2కు పంపిణీ చేస్తున్నామన్నారు.
తెలంగాణలో ప్రజాపంపిణీ ద్వారా ప్రయోజనం పొందుతున్న 2.82 కోట్ల లబ్థిదారులు సులభంగా ఎక్కడి నుంచైనా, ఏ రేషన్ షాపు నుంచైనాసరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చిందన్నారు. ఈ విధానాన్ని ఇప్పటి వరకు 2.10 కోట్ల మంది వినియోగించుకున్నారన్నారు.