రాష్ట్రీయం

కాళేశ్వరం ప్రాజెక్టులకు దేవతామూర్తుల పేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని వివిధ బ్యారేజీలు, పంపుహౌస్‌లకు దేవతామూర్తుల పేర్ల ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఖరారు చేశారు. ఆయా దేవతామూర్తుల పేర్లు ఇలా ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజికి లక్ష్మీ బ్యారేజిగా, కనె్నపల్లి పంపుహౌస్‌కు లక్ష్మీ పంపుహౌస్‌గా నామకరణం చేశారు. అన్నారం బ్యారేజికి సరస్వతీ బ్యారేజిగా, సిరిపురం పంప్‌హౌస్‌కు సరస్వతీ పంపుహౌస్ గా పేరు పెట్టారు. సుందిళ్ళ బ్యారేజికి పార్వతీ బ్యారేజిగా, గోలివాడ పంపుహౌస్‌కు పార్వతీ పంపుహౌస్‌గా నామకరణం చేశారు. నంది మేడారం రిజర్వాయర్ కమ్ పంపుహౌస్‌కు నంది పేరు ఖరారు చేశారు. లక్ష్మీపురం పంపుహౌస్‌కు గాయత్రిగా నామకరణం చేశారు.