రాష్ట్రీయం

పంచాయతీ రాజ్ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: కొత్త పంచాయతీ రాజ్ చట్టం వెలుగులో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ప్రజాప్రతినిధులు, అధికారుల విధుల నిర్వహణ విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జిల్లాపరిషత్‌లు, మండల పరిషత్‌లు ఇప్పటి మాదిరిగా ఏ పని లేకుండా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా విధులు, నిధులు, బాధ్యతలు అధికారాలు అప్పగిస్తామన్నారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకావడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామన్నారు. పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి గ్రీన్ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థపై ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ప్రభుత్వం స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలని నిర్ణయించిందన్నారు. సహాయ మంత్రి హోదా కలిగిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కూడా ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉండడం సమంజసం కాదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా పాలనలో భాగస్వామ్యం కావాలన్నారు. విద్య, వైద్యం, పచ్చదనం, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో ఎవరి పాత్ర ఎంత ఉండాలనే విషయమై నిర్థారిస్తామన్నారు. త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నుండి నిధులు వస్తాయన్నారు. దానికి సమానంగా రాష్ట్ర వాటా కేటాయిస్తామన్నారు. విధులను స్పష్టంగా పేర్కొన్న తర్వాత నిధులు విడుదల చేసిన తర్వాతనే గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభిస్తామన్నారు. గ్రామ పంచాయితీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఏ విధులు నిర్వర్థించాలనే అంశాలపై వారి బాధ్యతలు, అధికారాలు తదితర విషయాలపై సమగ్ర చర్చ, పూర్తి స్థాయి అధ్యయనం జరపాలని
ఆయన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును ఆదేశించారు. ఈ విభాగంలో అనుభవం ఉన్న వారితో చర్చించి ముసాయిదా రూపొందించాలన్నారు. ముసాయిదాపై ప్రజాప్రతినిధులతో చర్చిస్తామని, అనంతరం మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీలో కూడా ఈ అంశాలపై చర్చిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సీఈవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈవోపీ ఆర్డీ పోస్టులను ఇకపై మండల పరిషత్ అధికారులుగా పరిగణిస్తుమన్నారు. గ్రామ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయితీ అధికారులు, డిప్యూటీ సీఈవోలు, డీపీవోలు, సీఈవోలకు పదోన్నతులు కల్పిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు నేరుగా నియామకాలు జరపాలన్నారు.