రాష్ట్రీయం

‘త్రిశంకు స్వర్గం’లో మున్సి‘పోల్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ‘త్రిశంకు స్వర్గం’లో ఊగిసలాడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఎదురౌతున్న అడ్డంకులన్నింటినీ తొలగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతోంది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని, కోర్టు అనుమతిస్తే, ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరతామని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నెల 13న విచారణ చేసేందుకు వీలుగా హైకోర్టు కేసును రెండురోజుల క్రితమే కేసును వాయిదా వేసింది. అంటే మంగళవారం విచారణ జరుగుతుంది.
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సిద్ధంగా ఉందని, ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయని, వార్డుల పునర్విభజన చేశామని, రిజర్వేషన్లు ఖరారు చేశామంటూ ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీల్లో ఎదురైన సమస్యలను పరిష్కరించామంటూ కోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. 13న విచారణ తర్వాత వెంటనే తీర్పు ఇస్తుందా లేక మళ్లీ వాయిదా వేస్తుందా అన్నది కోర్టు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కోర్టు తీర్పుకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ఈ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్ర ప్రభుత్వం 2019 జూన్‌లో భావించినట్టు కార్యక్రమాలన్నీ సజావుగా జరిగి ఉంటే ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యేవి. కోర్టుల్లో కేసులు, విపక్షాల ఆందోళనలు, ఓటర్ల జాబితాలో తప్పులు, వార్డుల పునర్విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తదితర అంశాల్లో సమస్యలు తలెత్తడంతో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుకావడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆరు నెలల నుండే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంది. వార్డుల రిజర్వేషన్లు, వార్డుల పునర్వ్యవస్థీకరణ తదితర వివరాలు ప్రభుత్వం నుండి అందిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామని రెండు నెలల క్రితమే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగానే జూలై రెండోవారంలో రాష్టవ్య్రాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా ప్రకటన, వార్డుల పునర్వ్యవస్థీకరణ, అఖిలపక్షం సమావేశాలు నిర్వహించారు. వీటిలో తప్పులు దొర్లాయంటూ కోర్టులో కేసులు నమోదు కావడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. మున్సిపల్ వ్యవహారాల ముఖ్యకార్యదర్శి ఒకవైపు తన శాఖ అధికారులతో, మరోవైపు ఎన్నికల కమిషన్‌తో చర్చిస్తూనే కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి సమగ్ర కౌంటర్ అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. కోర్టు ఆదేశాలకు లోబడే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.