రాష్ట్రీయం

మహిళపై అత్యాచారం, హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 500 జరిమానా విధిస్తూ మంగళవారం ఐదవ, అదనపు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి తీర్పు చెప్పారు. ఎంఎస్ మక్తాకు చెందిన చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ సంచులు ఏరుకునే ఎన్ మల్లేష్ (25) స్క్రాప్ షాపు నిర్వాహకుడు మహమ్మద్ జహంగీర్ (27) కొబ్బరి వ్యాపారి ఎండి చాంద్ (24) డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎస్‌కె ఆరిఫ్ (27)లు కలసి 2011 నవంబర్ 4న అమీర్‌పేట్ సమీపంలోని బిగ్‌బజార్ వద్ద ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. పరారీలో ఉన్న వీరిని అదే ఏడాది నవంబర్ 10న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా వీరిలో మల్లేష్, జహంగీర్ జైల్లోనే ఉండగా, చాంద్, ఆరిఫ్ బెయిల్‌పై విడుదలై మళ్లీ జైలులోనే ఉన్నారు. నాటి పంజగుట్ట ఇన్‌స్పెక్టర్లు అశోక్ చక్రవర్తి, తిరుపతి వీరిపై చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా మహిళపై అత్యాచారం జరిపి, హత్య చేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పద్మలత సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టగా నిందితులు ఎన్ మల్లేష్, ఎండి జహంగీర్‌లకు జీవిత ఖైదు, చాంద్, ఆరిఫ్‌లకు పదేళ్లు జైలుశిక్షతోపాటు ఐదు వందల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.