రాష్ట్రీయం

ప్రతి కుటుంబానికి హెల్త్‌కార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇకపై హెల్త్‌కార్డ్‌లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య, ఆరోగ్యశాఖపై సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యూఆర్ కోడ్‌తో హెల్త్‌కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించి ఆరోగ్య ప్రమాణాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు. దీనివల్ల ఆసుపత్రులకు ఎవరైనా బాధితులు వెళ్లినప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటనేది వైద్యులు గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్య వివరాలు గోప్యంగా ఉంటాయని చెప్తూ స్కాన్ చేసిన వెంటనే ఓటీపీ నెంబర్ వస్తుందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 21లోగా కార్డులు జారీ చేయాలని నిర్దేశించారు. రూ. 5 లక్షల లోపు ఆదాయపరిమితి ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని తెలిపారు. దీనివల్ల కోటిన్నర మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేశామన్నారు. ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చాల్సిన వ్యాధుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ఇప్పుడున్న సేవలను రెట్టింపు చేయాలని నిర్ణయించామన్నారు. రెండు వేలకు పైగా వ్యాధులకు ఈ పథకం కింద వైద్య సేవలందిస్తామని సీఎం వెల్లడించారు. జనవరి ఒకటవ తేదీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించారు. మూడు నెలల పాటు ఈ పథకం అమలును ఆధ్యయనం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఆపై అన్ని జిల్లాలకు వర్తింప చేస్తామన్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రులలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలన్నారు. థర్డ్ పార్టీ ద్వారా తరచు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ప్రమాణాలు పాటిస్తున్న, సౌకర్యాలు కలిగిన ఆసుపత్రులను ఏ ప్లస్, ఏ కేటగిరీగా గుర్తించాలని, లోపాలున్న వాటిని బీ కేటగిరీగా గుర్తించి కొంత వ్యవధి ఇవ్వాలన్నారు. తిరిగి తనిఖీలు చేసినప్పుడు పరిస్థితి అదే విధంగా ఉండి మార్పు రాని పక్షంలో వాటిని నెట్‌వర్క్ జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. ప్రమాణాలు, సౌకర్యాలు పూర్తిగాలేని ఆసుపత్రులను సి కేటగిరీ కింద గుర్తించి పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయంలో నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుబాటులో ఉంచాలన్నారు. అర్హత ఉన్న ఆసుపత్రుల ఏవైనా సరే నెట్‌వర్క్ ఆసుపత్రుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. సెప్టెంబర్ నుంచి నెట్‌వర్క్ ఆసుపత్రులలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రులను ఏ ప్లస్ కేటగిరీగా పరిగణించాలన్నారు.
పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలోని 150 ఆసుపత్రులకు గుర్తింపు ఇచ్చింది. నవంబర్ మొదటి వారం నుంచి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రభుత్వాసుపత్రులలో వౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతులకు సంబంధించి టెండర్లు పిలిచినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఐపీహెచ్‌ఎస్ ప్రమాణాల ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రతి ప్రభుత్వాసుపత్రిలో మందులు, ప్రమాణాలు, సిబ్బంది, పరికరాలు, వౌలిక సదుపాయాల వారీగా ప్రాధమ్యాలను గుర్తించాలన్నారు. ప్రతి నియోజకవర్గం లేదా మండలంలో మొదటి దశలో ఒక ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల ఆధునికీకరణకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. 2020 డిసెంబర్ కల్లా టీచింగ్ ఆసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. జూన్ 2022 కల్లా హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణం జరగాలన్నారు. మందులు, రక్త పరీక్షల కోసం ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించే పరిస్థితికి స్వస్తి చెప్పాలన్నారు. ఏ పరికరం కొనుగోలు చేసినా నిర్వహణ, మరమ్మతుల కోసం ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. వైద్య పరికరాల సమర్థ నిర్వహణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు. సెప్టెంబర్ 2021 నాటికి ప్రభుత్వాసుపత్రులలో పూర్తిస్థాయిలో పరికరాలను అందుబాటులోకి తేవాలన్నారు. టీచింగ్, ఏరియా, జిల్లా ఆసుపత్రులలో వైఎస్సార్ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. రాష్ట్రంలో పూర్తి సదుపాయాలతో ఐదు క్యాన్సర్ ఆసుపత్రులు నెలకొల్పుతామని వెల్లడించారు. కడప, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, తిరుపతిలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రులు, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్ కళాశాలలకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో శంకుస్థాపనలు జరపాలన్నారు. అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు పరీక్షలను ప్రారంభిస్తామన్నారు. ఆపరేషన్లు అవసరమైన వారిని వైద్యులు గుర్తించిన అనంతరం క్రమం తప్పకుండా శస్త్ర చికిత్సలు, అద్దాలు అందచేయాలని నిర్దేశించారు. 108, 104 సేవలను విస్తృతం చేసేందుకు త్వరలో వెయ్యి వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌లో టెండర్లు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.

చిత్రం... వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి