రాష్ట్రీయం

ఉత్తర తెలంగాణలో నేడు భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో బుధవారం రాత్రివరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం వల్ల ఆదిలాబాద్, కొమురంబీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిర్సిల్లా, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ (పట్టణ), వరంగల్ (గ్రామీణ) మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. ఇలా ఉండగా తెలంగాణలో నైరుతీ రుతుపవనాల ప్రభావం బలహీనంగా ఉన్నట్టు వెల్లడించారు. గత 24 గంటల్లో సూర్యాపేట, సంగారెడ్డి, కొమురంబీం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, కామారెడ్డి, జనగామ, నిర్మల్ తదితర జిల్లాల్లో చిన్నపాటి వానలు కురిశాయి.