రాష్ట్రీయం

నిలకడగా శ్రీశైలం జలాశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, ఆగస్టు 13: కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం జలాశయం నిలకడగా ఉంది. జూరాల డ్యాం గేట్ల ద్వారా 7,33,020 క్యూసెక్కులు, సుంకేసుల డ్యాం ద్వారా 1,93,612 క్యూసెక్కులు మొత్తం 9,26,632 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,194 క్యూసెక్కులు, తెలంగాణ భూగర్భ జల విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా 28వేల క్యూసెక్కులు, హంద్రీనీవా కేనల్ ద్వారా 2026 క్యూసెక్కులు, డ్యాం 10 వరద గేట్లను 42 అడుగుల మేర ఎత్తి 7,81,260 క్యూసెక్కులు మొత్తం 8,81,028 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలు నిర్విరామంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌లో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గాను 879 అడుగులుగా, గరిష్ట నీటి నిలువ 215 టీఎంసీలకు గాను 184.7062 టీఎంసీలుగా నిలువ ఉంది.
డ్యాం వద్ద సందర్శకుల తాకిడి
శ్రీశైలం డ్యాం గేట్ల ద్వారా పడుతున్న నీటిని చూసేందుకు మంగళవారం కూడా సందర్శకుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. సోమవారం బక్రీద్ పండుగను జరుపుకొని ముఖ్యంగా కర్నూల్ జిల్లా ప్రాంతం నుంచి ముస్లిం సోదరులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. గేట్ల ద్వారా పడుతున్న నీరు వాహనాల రాకపోకలు జరిగే రోడ్లపైన చిరుజల్లులుగా పడుతుండటంతో సందర్శకులు వాహనాలు దిగి ఆ నీటిలో తడుస్తూ సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొడుతున్నారు. దోమలపెంట నుంచి శ్రీశైలం వరకు వాహనాలు సందర్శకులతో రోడ్లన్నీ నిండిపోయాయి.

చిత్రం... శ్రీశైలం జలాశయం నుంచి విడుదలవుతున్న వరద నీరు