రాష్ట్రీయం

ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 14: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. పులిచింతల నుంచి వచ్చిన నీరు వచ్చినట్టే నేరుగా సముద్రం వైపు పరుగులు తీస్తోంది. బుధవారం ఉదయం 9 గంటల సమయానికి మొత్తం 70 గేట్లను 9 అడుగుల మేర పైకి ఎత్తి రికార్డు స్థాయిలో నాలుగు లక్షల 65వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ కృష్ణాజిల్లా నది పరివాహక ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరకట్ట దిగువనున్న అక్రమ నిర్మాణాలన్నీ వరద ముంపునకు గురైనాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద వరద నీటి ప్రవాహం క్షణ క్షణం పెరుగుతోంది. అధికారులు ముందుజాగ్రత్తగా బాబు నివాసం వద్ద ఇసుక బస్తాలు సిద్ధం చేశారు. చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయన కాన్వాయ్‌ను మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్సుకు తరలించారు. కింది అంతస్తులోని ముఖ్య వస్తువులన్నింటినీ మొదటి అంతస్తుకు తరలించారు. నిత్యం బాబు ఉపయోగించి వాకింగ్ ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు 9 లారీల్లో ఇసుక తెప్పించి ఇంటి చుట్టూ ఇసుక బస్తాలేస్తున్నారు ప్రతిరోజు కనిపించే లోకేష్ కాన్వాయ్... ప్రైవేటు వాహనాలను సైతం అక్కడ నుంచి తరలించారు. ఇలాఉంటే ప్రకాశం బ్యారేజీ, వారధి వద్ద సందర్శకుల తాకిడి పెరుగుతూ ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సి వస్తోంది. వాహనాల్లో వెళ్లే వారు తమ వాహనానలను నిలిపి మరీ సెల్ఫీ ఫొటోలు దిగుతున్నారు.
చిత్రం... కరకట్ట పై చంద్రబాబు నివాసం వద్ద వరద నీటి ప్రవాహం