రాష్ట్రీయం

శేషం రామానుజాచార్యులు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: ప్రముఖ కవి, వ్యాఖ్యాత శేషం రామానుజాచార్యులు శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామానుజాచార్యులు మృతిపట్ల పలువురు కవులు, కళాకారులు, అభిమానులు నివాళులర్పించారు. ఆకాశవాణి కార్యనిర్వహణ అధికారిగా విభిన్న కార్యక్రమాలను ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు. అంతేకాకుండా ప్రముఖ పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాశారు. ఆముక్తమాల్యద, చింతరామృతం, చైతన్యరేఖలు, సమాలోచన, రంఘనాథ వైభవం వంటి రచనలు చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, యాదగిరీశుని ఉత్సవాల్లో ఆచార్యులు చేసిన వ్యాఖ్యానం ఎందరినో ఆకట్టుకుంది.