రాష్ట్రీయం

కృష్ణా తీరం విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 16: కృష్ణానదికి మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణాజిల్లాలో నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, లంకలు విలవిల లాడుతున్నాయి. 24 గ్రామాలు వరద తాకిడికి గురి కాగా 12 గ్రామాలు జలదిగ్బంధానికి గురై బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీర్‌ఎఫ్, రెవెన్యూ, ఫైర్, పోలీస్‌శాఖలకు చెందిన దాదాపు వెయ్యి మంది సిబ్బంది ముంపు గ్రామాల ప్రజల తరలింపులో నిమగ్నమై ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే ఆర్మీ, నేవీ దళాల సేవలను కూడా వినియోగించుకుంటామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. జిల్లా మొత్తంపై 40 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు కాగా వీటిల్లోకి ప్రస్తుతం 12వేల మందికి పైగా తరలించారు. వరద నీటి కారణంగా 10వేల ఎకరాల్లోని వరి, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా 200 గృహాలు దెబ్బతిన్నట్లు అంచనా. విజయవాడ ప్రకాశం బ్యారేజీపై ముందుజాగ్రత్త చర్యగా భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిల్పివేశారు. ఇదిలావుంటే వరద నీటితో పాటు వేల సంఖ్యలో పాములు కొట్టుకు వస్తుండటంతో తీర ప్రాంత ప్రజలు భీతిల్లుతున్నారు. పాముకాటు విరుగు మందును శిబిరాల్లో సిద్ధం చేశారు. చెవిటికల్లు లంక ప్రాంత ప్రజలను పడవల్లో కంచికచర్లకు తరలిస్తుండగా ఒక పడవ బోల్తా పడటంతో ఆరో తరగతి చదవుతున్న కంచర్ల తులసీప్రియ(11) అక్కడికక్కడ మరణించగా తొమ్మిది మంది సురక్షితంగా బైటపడ్డారు. కంచికచర్ల మండలంలో మున్నలూరు, కొనికనపాడు, చెవిటికల్లు, ఘని ఆత్కూరు, కొత్తపేట గ్రామాలు జలదిగ్బంధానికి గురియ్యాయి. చెవిటికల్లులో ఒక మృతదేహాన్ని తెప్పపై శ్మశానవాటికలోకి తీసుకెళ్ళి ఖననం
చేయాల్సి వచ్చింది. గని ఆత్కూరులో 500 గొర్రెలు, ఐదుగురు గొర్రెల కాపరులు జలదిగ్బంధంలో చిక్కుగా పడవల్లో సురక్షితంగా తరలించారు. జగ్గయ్యపేట మండలంలో ముక్త్యాల, రావిరాల, జయంతిపురం, వేదాద్రి గ్రామాలు జలదిగ్బంధానికి గురయ్యాయి. ఆయా గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ నీట మునిగాయి. పాలేరు వంతెన, చంద్రయ్య కయ్య వద్ద నిలువెత్తు నీరు ప్రవహిస్తోంది. ఘంటసాల మండలం పాపనాశనం గ్రామం సమీపంలో కరకట్ట తెగి గ్రామంలోకి నీరు ప్రవహిస్తుండగా తక్షణమే ఇసుక బస్తాలతో గండి పూడ్చారు. తోట్లవల్లూరు మండలంలో పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం చినలంక, పెదలంక గ్రామాలు నీటి మునగ్గా అక్కడి ప్రజలు ట్రక్ టర్మినల్‌కు తరలించారు. విజయవాడలో భవనీపురంలోని కుమ్మరిపాలెం, కృష్ణలంకలోని భూపేష్‌నగర్, రామకోటినగర్, తారక రామనగర్ ప్రాంతలు నీటి మునిగాయి. కలెక్టర్ ఇంతియాజ్, పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, మంత్రులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్‌లు ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు పర్యవేక్షించారు.