రాష్ట్రీయం

ఖాళీ చేయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తక్షణం నివాసాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి నోటీసులు జారీచేశారు. శనివారం తాడేపల్లి తహశీల్దార్ వాకా శ్రీనివాసులురెడ్డి పేరిట డిప్యూటీ తహశీల్దార్ జి శ్రీనివాస్ సంతకంతో కూడిన నోటీసును విఆర్‌ఓ ప్రసాద్ ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న చంద్రబాబు నివాసానికి అంటించారు. నివాసంలోకి వెళ్లేందుకు విఆర్‌ఓ ప్రయత్నించినప్పటికీ భద్రతా సిబ్బంది అనుమతించలేదు. దీంతో అక్కడే ఉన్న గోడకు అంటించి వెనుదిరిగారు. చంద్రబాబు నివాసంతో పాటు మరో 32 ఇళ్లకు ఇదేతరహా నోటీసులు జారీ చేశారు. వరదల వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూసేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వరదల కారణంగా గృహాల్లోకి నీరు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గృహ యజమానులకు సూచించారు.