రాష్ట్రీయం

తొలగని ప్రతిష్టంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వానికి-నెట్‌వర్క్ ఆసుపత్రుల మధ్య ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. ఆరోగ్యశ్రీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, నెట్‌వర్క్ ఆసుపత్రుల ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన చర్చల తర్వాత శనివారం ఎలాంటి పురోగతి కనిపించలేదు. బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలు, నెట్‌వర్క్ దవాఖానాలు చెబుతున్న లెక్కలకు పొంతన లేకపోవడంతో అయోమయం నెలకొంది. శనివారం రోజు ఉదయం హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటల మధ్యాహ్నం తర్వాత తన సొంత జిల్లాకు వెళ్లిపోయారు. దాంతో ప్రభుత్వం, నెట్‌వర్క్ ఆసుపత్రుల మధ్య శనివారం ఎలాంటి చర్చలు జరగలేదు. ఆరోగ్యశ్రీ పథకానికి సేవలు అందించినందుకు తమకు 1500 కోట్ల రూపాయలు రావలసి ఉందని ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆసుపత్రుల సంఘం, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ప్రతినిధులు పేర్కొనగా, కేవలం 600 కోట్ల రూపాయలే చెల్లించాల్సి ఉందని మంత్రి ఈటల నిన్ననే అధికారికంగా వెల్లడించారు. ఈ అంశంపై అన్ని కోణాల్లో పరిశీలించాలని మంత్రి జారీ చేసిన ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ మాణిక్ రాజ్ శనివారం కసరత్తు చేశారు. సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు. ఏ ఏ దవాఖానాల నుండి ఎన్ని చికిత్సలకోసం బిల్లులు వచ్చాయో పరిశీలించారు. రాష్ట్రంలో 96 ప్రభుత్వ దవాఖానాలతో పాటు 13 కార్పోరేట్ దవాఖానాలు, 114 ప్రైవేట్ దవాఖానాలు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్నాయి. ఈ ఆసుపత్రులనుండి వచ్చిన ప్రతిపాదనలకు సంబంధించి మొత్తం డబ్బు ఎంత, ప్రభుత్వ ఆమోదించిన ప్రతిపాదనలకు సంబంధించిన డబ్బు ఎంత, విడుదలైంది ఎంత తదితర అంశాలపై మాణిక్‌రాజ్ అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలను ఆదివారం వరకు క్రోడీకరిస్తే, మళ్లీ సోమవారం మంత్రి రాజేందర్ వద్ద చర్చలు జరిగే అవకాశం ఉందని తెలిసింది.