రాష్ట్రీయం

కమల వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీలో కోలాహలం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా అనేక కారణాల వల్ల చురుకుగా వ్యవహరించకపోవడం వల్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టింది. దీనికి తోడు వరుసగా రెండోసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో నాలుగు లోక్‌సభ సీట్లలో గెలవడంతో రాష్ట్ర బీజేపీలో జోష్ పెరిగింది. ఆదివారం సాయంత్రం ఇక్కడ బీజేపీ వర్కింగ్ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే బహిరంగ సభలో టీడీపీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే రాజ్యసభ టీడీపీ ఎంపీ గరికపాటి రాజారావు బీజేపీలో చేరిన విషయం విదితమే. గరికపాటికి టీడీపీపై పట్టుంది. ఆ పార్టీలో అనేక ఏళ్లపాటు ఉండడం వల్ల ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో గరికపాటి చొరవ వల్ల పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి వస్తున్న నేతలు, కార్యకర్తలతో బీజేపీ నేతలు ఖుషీఖుషీగా ఉన్నారు. రాష్ట్రంలో 20లక్షల సభ్యత్వం పూర్తి చేయాలని ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆదేశించిన విషయం విదితమే. దీంతో పెద్ద ఎత్తున సభ్యత నమోదుపై బీజేపీ నేతలు దృష్టి సారించారు. వచ్చే నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్‌షా చేత జాతీయ జెండాను ఎగుర వేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎత్తున స్వాగతం చెప్పేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే సభలో జేపీ నడ్డా ప్రసంగిస్తారు. ఈసభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ , సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొంటారు. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు, ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ జీ వివేక్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.