రాష్ట్రీయం

కన్నుల పండువగా మధ్యారాధన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఆగస్టు 17: మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి 348వ సప్త ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యారాధన వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూలబృందావనానికి వేయి లీటర్ల పాలతో అభిషేకం చేశారు. టీటీడీ సమర్పించిన పట్టువస్త్రాలను అలంకరించారు. రకరకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేసి మహామంగళహారతి ఇచ్చారు. అనంతరం శ్రీరాఘవేంద్ర గురువుల ప్రతిమ, సుధాపరిమళ గ్రంథాలను నవరత్న రథంపై ఉంచి మఠం ప్రాకారంలో అశేష భక్తుల జయజయధ్వనాల మధ్య ఊరేగించారు. మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి శ్రీప్రహ్లాదరాయలును గజవాహనంపై ఊరేగించారు. వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహారథోత్సవం జరుగుతుంది.