రాష్ట్రీయం

అంతర్వేదిలో గ్యాస్ లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం/ సఖినేటిపల్లి, ఆగస్టు 17: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో నిత్యం చమురు సంస్థల నిర్వహిస్తున్న గ్యాస్ పైపులు, చముర బావుల నుంచి గ్యాస్ లీకేజీలు అక్కడ ప్రజలకు ప్రాణ సంకటంగా తయారైంది. కాలం చెల్లిన పైపులైన్ల స్థానే కొత్తవి వేయకపోవడమే ఈ గ్యాస్ లీకేజీకి కారణమని పలుమార్లు స్థానికులు ఓఎన్జీసీ అధికారులు దృష్టికి తీసుకొచ్చినా వారి నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ గ్యాస్ లీకేజీలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరం ఘటన ఇంకా ప్రజలు మరువకుండానే అటువంటి ఘటనలు తరచూ తలెత్తడంతో ఈ ప్రాంత నివాసిత ప్రజలు ప్రాణాలరచేతిలో పెట్టుకుని దినదిన గండంగా జీవిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి అంతర్వేదిలో గ్యాస్ లీకేజీ మరో విస్ఫోటంగా తయారుకావడంతో అక్కడ ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. అంతర్వేది బులిశెట్టివారి పుంత సెయింట్ మేరీ పాఠశాల వద్దనున్న ఓఎన్జీసీ బావి వద్ద శుక్రవారం రాత్రి గ్యాస్ లీకై మంటలు చెలరేగి బూడిద రూపంలో గ్యాస్ పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఈ ఘటనలో దాదాపు కిలోమీటరు దూరం వరకు పొగలతో కూడిన గ్యాస్ ఆవరించడంతో స్థానికులు ఆందోళన చెందారు. విషయాన్ని స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు తెలియజేయటంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బావి నుంచి గొట్టాలు ద్వారా లీక్ అవుతున్న గ్యాస్‌ను అదుపు చేశారు. రాత్రికి రాత్రే పోలీసులు, ఓఎన్జీసీ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీక్‌పై అధికారులను స్థానికులు నిలదీసి ఆందోళన చేశారు. జనావాసాలకు దూరంగా కొత్త పైపులైన్లు వేయాలని స్థానికులు కోరుతున్నారు. శనివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, ఓఎన్జీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ అజిత్‌కుమార్, ఏరియా మేనేజర్ దత్తు, స్థానిక తహసీల్దార్ ప్రకాష్‌బాబు, ఎస్సై సురేష్‌బాబు, మెరైన్ ఏఎస్సై రాజు, పెద్దలు ప్రమాద స్థలానికి చేరుకుని చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ ఓఎన్జీసీ జనవాసాల మధ్య నుంచి పైపులైన్లు వేసిందని, కొత్త పైపులైన్లు వేసి ప్రజలకు ప్రాణరక్షణ కల్పించకపోతే తాము ఉద్యమించి ఓఎన్జీసీ కార్యకలాపాలను అడ్డుకుంటామని అధికారులను హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన రక్షణ చర్యలు తీసుకోకపోతే మోరి 1, 2 బావులను నిలుపుదల చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ గ్రూపు జనరల్ మేనేజర్ అజిత్‌కుమార్ శనివారం ఉదయం సంబంధిత అధికారులతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అజిత్‌కుమార్ మాట్లాడుతూ ఈ ప్రమాదం పట్ల వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఆందోళన పడవద్దన్నారు. ఉన్న ఏడు లైన్లలో మూడు లైన్లు సరిగాలేనట్లు తాము గుర్తించామని, త్వరలోనే వాటిని తొలగిస్తామన్నారు. ఈ రోజు నుంచి ప్రమాద స్థలంలో ఒకర్ని కాపలాదారుడిగా నియమిస్తామన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు సత్వరమే తీసుకోవాలని ఓఎన్జీసీ గ్రూప్ జీఎం అజిత్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
చిత్రాలు.. అంతర్వేదిలో గ్యాస్ లీక్ అయిన పైపులైన్ ప్రాంతం..
*ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాపాక