రాష్ట్రీయం

గిరిజన బాలికల తరలింపుపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఆగస్టు 17: గిరిజన బాలికలను వ్యభిచార కూపాలకు తరలిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై సీఐడీ డీఎస్పీ నాగేశ్వరి శనివారం సమగ్ర విచారణ నిర్వహించారు. విశాఖ ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన బాలికలను అక్రమంగా తరలించి వ్యభిచార కూపాలకు విక్రయిస్తున్నట్టుగా ఇటీవల కొన్ని ఆరోపణలు బయటకు వచ్చాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలంటూ సీఐడీ విశాఖపట్నం డీఎస్పీని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరి శనివారం పాడేరు వచ్చి ఈ వ్యవహారంపై క్షుణ్ణంగా విచారణ చేపట్టారు.
ఈ మేరకు స్థానిక శ్రీక్రిష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలతో పాటు గిరిజన బాలికలు ఉండే పలు విద్యా సంస్థలను ఆమె సందర్శించి గిరిజన విద్యార్థినులతో సుదీర్ఘంగా మాట్లాడారు. వసతి గృహాల్లో ఉండే బాలికలు ఎవరైనా తప్పిపోయినట్టు ఏమైనా దాఖలాలు ఉన్నాయా అనే కోణంలో ఆమె బాలికలను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించి గిరిజన బాలికల ఆదృశ్యంపై ఏమైనా కేసులు నమోదయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయకుమార్‌తో ఆమె సమావేశమై గిరిజన ప్రాంతంలో గల ఆశ్రమ పాఠశాలలు, వీటిలో ఎంతమంది బాలికలు చదువుతున్నారనే వివరాలపై వాకబు చేసారు. ఆశ్రమాల్లో చదువుతున్న బాలికలు పాఠశాలను విడిచిపెట్టి వెళ్లిపోయిన సంఘటనలపై ఆరా తీసారు. అయితే తమ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో బాలికలు ఎవ్వరూ తప్పిపోయిన సంఘటనలు లేవని, అన్ని ఆశ్రమాల్లో నమోదైన బాలికలంతా విద్యాభ్యాసం చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో బాలికల విద్యాభ్యాసంలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. గిరిజన బాలికల్లో చైతన్యం కల్పించే ఎటువంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు, వాటి వలన లభిస్తున్న ప్రయోజనం, అనవసరమైన కార్యక్రమాలను ఏమైనా చేస్తున్నారా వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. గతంలో కంటే ప్రస్తుతం బాలికల విద్యాభ్యాసం మెరుగుగా ఉందని, ఉపాధి అవకాశాల కోసం ఎక్కువగా వస్తున్నారని ఆమె చెప్పారు. ఇతరత్రా పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేరుకుని విద్యాభ్యాసంపై దృష్టి సారిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

చిత్రం...విశాఖ జిల్లా పాడేరులో గిరిజన బాలికలతో మాట్లాడుతున్న సీఐడీ డీఎస్పీ నాగేశ్వరి